హెపటైటిస్‌కి హోమియో బెస్ట్


Wed,December 9, 2015 12:28 AM

హెపటైటిస్ అనగానే మామూలుగా అందరూ అనుకునే హెపటైటిస్ బి ఒకటే కాదు. దీనిలో వివిధ రకాలున్నాయి. హెపటైటిస్ బితో పాటు హెపటైటిస్ సి, ఎ, ఇ, ఎఫ్ అనే రకాలు కూడా ఉన్నాయి. ఇది ఒక కాలేయ జబ్బు. కాలేయ కణాలు వాచిపోవడం వల్ల ఫైబ్రోసిస్, సిర్రోసిస్‌లకు దారితీస్తుంది. అందువల్ల కాలేయం మెల్లగా పనిచేయడం ఆగిపోయి ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాలేయ క్యాన్సర్‌కు కూడా దారితీసే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెపటైటిసి ప్రమాదకరమైన జబ్బుగా గుర్తించింది. దీనిమీద పరిశోధన కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది. హెపటైటిస్ బి, సి రోగులు ఉన్న ప్రాంతాలు ఆఫ్రికా, ఆసియా, అరేబియా దేశాలు. మనదేశంలో 2010 గణాంకాల ప్రకారం 40 నుంచి 80 మిలియన్ల వరకు హెపటైటిస్ బాధితులున్నారని అంచనా. అనధికారిక గణాంకాలు ఇంతకన్నా ఎక్కువగానే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏటా దాదాపుగా 6 నుంచి 10 లక్షల మంది దీనివల్ల మృత్యువాత పడుతున్నారు. హెపటైటిస్ బి, సిలకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలావరకు ఈ జబ్బుకు పూర్తిస్థాయి చికిత్సలు లేవు. కానీ హోమియో వైద్య విధానం మాత్రం దీనికి శాశ్వత చికిత్సను అందిస్తోంది.

కారణాలు


-హెపటైటిస్‌కి ముఖ్య కారణాలు లైంగిక సంబంధాలు, రక్తమార్పిడి. ప్రమాదాలు, ఆపరేషన్లు జరిగినప్పుడు రక్తం అవసరమై అత్యవసర పరిస్థితులలో రక్తదాతకు రక్తపరీక్షలు చేయకుండా నేరుగా రక్తం ఎక్కించినప్పుడు ఈ వ్యాధి రావచ్చు.
వాడిన ఇంజెక్షన్ సిరంజీలు, సూదులను మళ్లీ మళ్లీ వాడటం
ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకి
హెపటైటిస్ బి, సి ఉన్న వ్యక్తి వ్యాధి తీవ్రత లేదా వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే అతని ద్వారా కుటుంబ సభ్యులకు ఉమ్మి ద్వారా, అల్సర్ల ద్వారా వ్యాపించవచ్చు. 30 శాతం మందిలో ఏ కారణమూ లేకుండా రావచ్చు.

లక్షణాలు


వ్యాధి సోకిన వెంటనే ఆ వ్యక్తి రోగ నిరోధక శక్తి మీద దాడి చేస్తుంది. అందువల్ల ఆకలి లేకపోవడం, వాంతులు, వాంతి వచ్చినట్టు అన్పించడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. మూత్రం పచ్చగా రావడం మెల్లగా పచ్చకామెర్లుగా కనిపిస్తాయి. దీనితో పాటు చర్మంపై దురదలు ఉంటాయి. కొన్ని కేసుల్లో కాలేయం మొత్తానికే పనిచేయడం ఆగిపోవచ్చు. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలు కనబడకుండా శరీరంలో ఉండిపోయి సమయం కోసం వేచిచూస్తూ ఉంటుంది.

వ్యాధి సోకిన కొన్ని సంవత్సరాల తరువాత బయటపడితే దాన్ని క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ లివర్ లేదా క్రానిక్ హెపటైటిస్ అంటారు. దీనివల్ల జాండిస్ అసలు తగ్గవు. వాంతులు, దురదలు, కొన్నిసార్లు విరేచనాలు, కడుపుబ్బరంగా ఉండటం, వాచిపోవడం, పొట్టలో నొప్పి, వీటితో పాటుగా రక్తనాళాలు వాచిపోవడం, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, ప్లేట్‌లెట్‌ల సంఖ్య పడిపోవడం, తలనొప్పి, రక్తహీనత, రక్తకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం లాంటి లక్షణాలుంటాయి. లివర్ క్యాన్సర్‌కు కూడా ఇది దారితీయవచ్చు.

హోమియో చికిత్స


హెపటైటిస్ బి, సి వైరస్ కాలేయానికి హాని కలిగించేది. ఎందుకంటే ఇవి కాలేయంలోనే పెరుగుతాయి. కాలేయంలో వీటి ప్రత్యుత్పత్తిని హోమియోపతి ద్వారా అడ్డుకోవచ్చు. అందువల్ల వైరల్ లోడ్‌ని రోగ నిరోధక వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా అడ్డుకోవడం హోమియోపతి సహకరిస్తుంది. అప్పటికే ఉన్న వైరస్‌ను మరింతగా పెరగకుండా నివారిస్తుంది. లైకోపోడియం, మెర్స్‌సాల్, బ్రయోనియా లాంటి మందులు ఇందుకు బాగా పనిచేస్తాయి.

గుర్తించడం ఎలా


హెపటైటిస్ బి, సి లను నిర్ధారించడానికి హెచ్‌బిఎస్ యాంటిజెన్ అనే పరీక్ష, హెచ్‌సివి యాంటిబాడీ ఎంజైమ్ ఇమ్యూనో ఆసె పరీక్షలు ఉపయోగపడతాయి. హెపటైటిస్ బి, సి వైరల్ లోడ్, పీసీఆర్ పద్ధతిలో గానీ కనుక్కోవచ్చు. వీటితో పాటుగా లివర్ ఫంక్షన్ టెస్ట్, ఈఎస్‌ఆర్ ద్వారా కనుక్కోవచ్చు.

చికిత్స తీసుకోకుంటే...


rsvikiran


సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే లివర్ సిర్రోసిస్‌కి దారితీస్తుంది. లివర్ పూర్తిగా దెబ్బతినవచ్చు. లివర్ క్యాన్సర్‌కి కూడా దారితీయవచ్చు. లివర్‌తో పాటుగా స్ప్లీన్, కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

నివారణ


-హెపటైటిస్ బి, సి లకు వ్యాక్సిన్లు చేయించుకోవడం అత్యుత్తమ మార్గం.
-సురక్షితమైన శృంగారం, డిస్పోజబుల్ సిరంజిల వాడకం
-నూనె పదార్థాలు, మాంసాహారాలను తీసుకోకపోవడం. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినడం
-ఆల్కహాల్, పొగతాగడాన్ని పూర్తిగా మానివేయాలి.

1702
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles