హిరోయిన్ షిణి


Tue,October 2, 2018 11:07 PM

కాబోతున్నది భయమంటే తెలియని వయసులోనే వేదికలనెక్కింది.. ఏం చేస్తే నవ్వుతారో తెలియకుండానే అందరినీ నవ్వించింది.. ప్రతిరోజూ ఒకే వాయిస్‌తో మాట్లాడి బోర్ కొట్టినట్టుంది.. మిమిక్రీ చేయడం మొదలుపెట్టింది.. నవ్వులాటతో మొదలైన ప్రయాణం.. యాంకర్.. మిమిక్రీ, చైల్డ్ ఆర్టిస్ట్‌గా సాగింది.. కోమలి సిస్టర్స్‌లో ఒకరైన హిరోషిణి ఇప్పుడు ఏం చేస్తున్నదో తెలుసా? యన్‌టిఆర్ బయోపిక్‌లో కూతురుగా నటించే చాన్స్ కొట్టేసింది.
komali
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుందంటారు. కోమలి హిరోషిణి మాత్రం మిమిక్రీ, యాంకరింగ్, సంగీతం, నాట్యం, నటనతో మల్టీటాలెండెడ్ అని చెప్పొచ్చు. హిరోషిణి ఖమ్మంలో జన్మించినా రెండేళ్ల వయసులోనే హైదరాబాదుకు వచ్చేశారు వాళ్ల తల్లిదండ్రులు. తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. హిరోషిణి తండ్రి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వై. యస్. రాజశేఖర్ రెడ్డితో పాటు పాదయాత్రలో పాల్గొన్నాడు. తండ్రిని టీవీలో చూసి కోమలి సిస్టర్స్ మురిసిపోయేవారు. తండ్రి కోసమే ఎక్కువగా టీవీ చూడడం మొదలుపెట్టారు. ఇంట్లో ఎక్కువగా న్యూస్ చూడడం వల్ల రిపోర్టర్స్, యాంకర్స్ మాట్లాడడం చూసి వారిని ఇమిటేట్ చేయడం మొదలుపెట్టింది. వై. యస్ రాజశేఖర్ రెడ్డిని వార్తల్లో ఎక్కువగా చూసి మొదట ఆయన వాయిస్‌నే మిమిక్రీ చేయడం మొదలుపెట్టింది. మొదట్లో కరెక్ట్‌గా రాకపోయినా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసింది. ప్రయత్నించి చివరకు పూర్తి వాయిస్‌ను ఇమిటేట్ చేయగలిగింది. తరువాత చంద్రబాబు నాయుడు, మంచు లక్ష్మీ వాయిస్‌ను ఇమిటేట్ చేసి వారి ప్రశంసలు అందుకుంది. అలా సరదాగా ప్రారంభమైన ప్రయాణం అనేకానేక మలుపులు తిరిగి ఇప్పుడు హీరోయిన్‌గా కథలు వినే స్థాయి వరకు వచ్చింది.


చదువు.. లైవ్ షోలు

కోమలి సిస్టర్స్ (అక్కాచెల్లెళ్లు) నువ్వా-నేనా అంటూ పోటీ పడేవారు. ఇద్దరి తెలివితేటలు, షోల పట్ల ఆసక్తి చూసిన తల్లిదండ్రులు మిమిక్రీ ఆర్టిస్ట్‌లుగా బుల్లితెరకు పరిచయం చేశారు. టీ.వి-9లో నవ్వులాట ప్రోగ్రామ్‌తో తెరంగేట్రం చేశారు. ఆ షో హిట్ కావడంతో తరువాత లెక్కలేనన్ని ప్రోగ్రామ్స్, షోలతో బిజీ అయ్యారు. షోతో పాటు హిరోషిణి చదువును బాలెన్స్ చేసుకుంటూ వచ్చేది. బుల్లితెర మీదే కాకుండా అఆ సినిమాలో ఆర్టిస్ట్‌గా అందరినీ మెప్పించినది. నాలుగు సంవత్సరాల తర్వాత హిరోషిణి ఇప్పుడు ఎన్‌టిఆర్ బయోపిక్‌లో నటించే చాన్స్ కొట్టేసింది. ఏకంగా ఎన్‌టిఆర్ కూతురిగా నటిస్తున్నది.


ఎన్‌టిఆర్ బయోపిక్‌లో..

నాలుగు సంవత్సరాలుగా షోలకు దూరంగా ఉన్న హిరోషిణికి ఎన్‌టిఆర్ బయోపిక్‌లో అవకాశం వరించింది. బాలకృష్ణ, విద్యాబాలన్ వంటి పెద్ద హీరోలున్న సినిమాలో ఎన్‌టిఆర్ కూతురిగా సరిపోతుందని హిరోషిణిని ఎంపిక చేశాడు డైరెక్టర్ క్రిష్. అందరితో కలిసి పోవడం కోమలికి చిన్నప్పట్నుంచి అలవాటు కాబట్టి బయోపిక్ సెట్‌లో అంతగా ఇబ్బంది పడలేదు. సీనియర్ ఆర్టిస్ట్‌ల దగ్గర కూర్చుని యాక్టింగ్ గురించి తెలుసుకుంటుండేది. ఏ సిచ్యువేషన్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ పెట్టాలో వారిని గమనిస్తుంటుంది. సినిమాలకు తగిన విధంగానే డాన్స్ నేర్చుకున్నది. బాడీ ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నది. పెద్ద హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఇప్పడు కోమలి హిరోషిణి ఉంది.


ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు

మిమిక్రీ, ఆర్టిస్ట్, యాంకరింగ్‌తో సరిపెట్టకుండా ఉన్నత చదువులు కూడా చదువుతున్నది. యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్‌లో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఫైనలియర్ చదువుతున్నది. వీటితో పాటు డాన్స్, సంగీతం, నేర్చుకున్నది. సత్యానంద్ దగ్గర నటనలో మెళకువలు నేర్చుకున్నది. ఇక ఫిట్‌నెస్ విషయానికొస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. కునాల్ గిర్ స్టీల్ జిమ్‌లో వర్క్‌వుట్స్ చేస్తున్నది.


komali2
చిన్నతనం నుంచి టీవీలో ప్రోగ్రా మ్స్, న్యూస్ చూడడం అలవాటైంది. మనల్ని ఎంటర్‌టైన్ చేసేవాళ్లంటే ఎక్కువగా ఇష్టపడుతుంటాం. మనం కూడా ఎదుటివారిని ఎంటర్‌టైన్ చేస్తే అందరూ మనల్ని ఇష్టపడుతారని మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ముందుకొచ్చాను. ఆనుకున్నదానికంటే ఎక్కువ ఆదరణే దొరికింది. వయసుతో పని లేకుండా ఎన్నో ప్రోగ్రామ్స్‌తో అందిరినీ అలరించాను. కాలంతో పాటు మనం కూడా మారాలి. హోరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా మంచి హీరోయిన్‌గా కూడా ఫ్రూవ్ చేసుకుంటాను. ప్రస్తుతం ఎన్‌టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నాను. చాలెంజింగ్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నాను.
-వనజ వనిపెంట

1031
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles