హిడింబి దేవాలయం


Thu,August 16, 2018 10:46 PM

Hidimba_Devi_Temple
దేవతలకు దేవాలయాలు ఉండడం మనకు తెలుసు కానీ రాక్షసులకు దేవాలయం ఉండడం మీరెప్పుడైనా చూశారా? భారతంలో ఘటోత్కచునికి తల్లి... భీమునికి భార్య అయిన రాక్షస సంతతికి చెందిన హిడింబికి కూడా దేవాలయం ఉంది. ఇది హిమచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలీకి సమీపంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడికి ప్రతిఏటా వందల సంఖ్యలో పర్యాటకులు వచ్చిపోవడం మరో విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాక్షసికి దేవాలయం కట్టడం మనం ఇక్కడ మాత్రమే చూడగలం. గుడి చాలా పురాతన కట్టడంలా ఉంటుంది. ఒక గుహలో ఉంటుంది. నిత్యం అక్కడ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉండడం విశేషం. కొండ చుట్టూ మంచుతో కప్పి ఉంటుంది. ఎత్తయిన కొండలపై మరింత ఎత్తుగా చెట్లు ఆకాశంలో మబ్బులను తాకేలా ఉండడం విశేషం.

567
Tags

More News

VIRAL NEWS