హార్మోన్ సమస్యలు.. హోమియోవైద్యం


Wed,January 6, 2016 12:02 AM

హార్మోన్‌లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇవి మానవ శరీరంలో సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పహార్మోన్ సమస్యలు.. హోమియోవైద్యంటికీ, వీటి ప్రభావం వల్ల శరీరంలోని వివిధ సాధారణ జీ

వక్రియలైన జీర్ణక్రియ, శారరక, మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత, జీవక్రియలకు తోడ్పడుతాయి. మానవిఉడిలో ఈ హార్మోన్‌లు అసమతుల్యతకు గురైనపుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతాడు.


-థైరాయిడ్ హార్మోన్లు (టి3, టి4) - ఇవి థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. కాని వీటి ప్రభావం జీవక్రియలపై 90 శాతం ఉంటుంది. వీటి అసమతుల్యత వల్ల హైపోథైరాయిడ్, హైపర్‌థైరాయిడ్, గాయిటర్ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి.
-హైపోథైరాయిడ్ : బరువు పెరగడం, జుత్తు రాలడం, నీరసం, మతిమరుపు, నెలసరి సమస్యలు ఉంటాయి.
-హైపర్ థైరాయిడ్ : బరువు తగ్గడం, నీరసం, గుండెదడ, కాళ్లూ చేతులు వణకడం
-గాయిటర్ : గొంతు కింద ఉండే థైరాయిడ్ గ్రంథి వాపు. ఇది ముఖ్యంగా అయోడిన్ లోపం వల్ల వస్తుంది. దీనివల్ల హైపో, హైపర్ థైరాయిడ్ సమస్యలు కలిసి కూడా ఉండవచ్చు.


-ప్రస్తుత జీవనవిధానం అధిక ఒత్తిడికి గురికావడం వల్ల ఎక్కువ మంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. ఈ సమస్యలకు జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా దీని మూలకారణాన్ని గుర్తించి, వ్యక్తిత్వానికి అనుగుణంగా హోమియో ద్వారా చికిత్సనందించవచ్చు.


-ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ నెలసరి ప్రారంభం, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. వీటి అసమతుల్యత వల్ల నెలసరి సమస్యలు, పీసీఓడీ, హిర్పుటిజం (అవాంఛిత రోమాలు), సంతానలేమి సమస్యలు కలుగుఆయి. నెలసరి, మెనోపాజ్ సమయంలో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌లో హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల హాట్ ఫ్లషెస్, మానసిక అశాంతి, నీరసం, కీళ్లు, కండరాల నొప్పులు వస్తాయి.
-టెస్టోస్టిరాన్ : ఇది పురుషుల్లో ఉండే హార్మోన్. దీని అసమతుల్యత వల్ల శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణ సమస్యలు, సంతానలేమి ఉంటుంది.


-హార్మోన్ సమస్యలు ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. బయటి నుంచి ఎలాంటి హార్మోన్లు ఇవ్వకుండా అసమతుల్యతను సరిచేస్తుంది హోమియోవైద్యం. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా నెలసరి, పీసీఒడీ, సంతానలేమి, శుక్రకణ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చు.


-ఇది ఎడిహెచ్ (యాంటి డైయురెటిక్ హార్మోన్) లోపం వల్ల వస్తుంది. దీన్ని అతి మూత్రవ్యాధి అంటారు.


-క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ లోపం వల్ల లేదా తక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వల్ల వస్తుంది. ఇది రెండు రకాలు.
టైప్ 1 డయాబెటిస్ : ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వస్తుంది. దీన్ని జువెనైల్ డయాబెటిస్ మిల్లిటస్ అంటారు. ఈ వ్యాధి ఉన్నవారు పూర్తిగా ఇన్సులిన్ ఇంజెక్షన్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది.

-టైప్ 2 డయాబెటిస్ : ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా 30 ఏళ్లు పైబడిన వారిలో వచ్చే అవకాశం ఎక్కువ. ఈ మధ్య కాలంలో యుక్తవయసులో ఉన్నవారికి కూడా వస్తున్నది. డయాబెటిస్‌తో బాధపడేవారి రక్తంలోని చక్కెర శాతాన్ని సరిగా నియంత్రించకపోవడం వల్ల దీర్ఘకాలంలో డయాబెటిస్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతి, గుండెసమస్యలు, అంగస్తంభన సమస్యలు వస్తాయి.

హోమియో వైద్యం


srikanth


-డయాబెటిస్‌ను తొందరగా గుర్తించి కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంది. హోమియోపతి చికిత్స ద్వారా దీర్ఘకాలంగా డయాబెటిస్‌తో బాధపడేవారికి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని అదుపులో ఉంచవచ్చు.

1928
Tags

More News

VIRAL NEWS