హనన్.. ఆర్థికసాయం!


Sun,August 19, 2018 01:22 AM

హనన్.. ఈ అమ్మాయి అందరికీ గుర్తుంది కదూ? చేపలు అమ్మి తాను దువుకుంటూ.. కుటుంబాన్ని పోషిస్తూ అందరిచే శభాష్ అనిపించుకున్న కేరళ అమ్మాయి. ఇప్పుడు మరోసారి తన బాధ్యతను చాటుకున్నది. చేపలు అమ్మగా వచ్చిన డబ్బును కూడబెట్టిన హనన్.. ఆ డబ్బును కేరళ వరద బాధితులకు సాయంగా అందించింది.
Hanan
చేపలు అమ్ముతూ తన కష్టమేదో తాను పడుతుంటే.. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని తనపై కామెంట్స్ చేసినవారికి హనన్ చెంప చెల్లుమనేంత పని చేసింది. కేరళలో ఉంటూ కోట్ల రూపాయల వ్యాపారం చేసేవాళ్లు వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాముందు ఆడుతున్నారు. కానీ ఒక నిరుపేద యువతి అయుండి.. చదువు కోసం.. కుటుంబ పోషణ కోసం చేపలు అమ్ముతూ పైసా పైసా కూడబెట్టిన హనన్.. ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసి సమాజం పట్ల తనకున్న బాధ్యతను.. సేవా గుణాన్ని చాటుకున్నది. నేను ఈ ప్రాంతంలో పుట్టాను. పెరిగాను. చదువుకున్నాను. స్వయం ఉపాధి పొందుతూ ఎంతో కొంత సంపాదిస్తున్నాను. నా కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాను. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొంత డబ్బును పోగు చేసుకున్నాను. కానీ మాతో పాటు అందరికీ వరద తీవ్ర నష్టాన్ని కలిగించింది. ముందస్తుగా అమ్మను.. తమ్ముడిని సురక్షిత ప్రాంతాలకు పంపించాను. మేమైతే సేఫ్‌గా ఉన్నాం. కానీ మిగతవాళ్ల పరిస్థితి ఏంటి అనే ఆందోళన మొదలై.. నా దగ్గర ఉన్న రూ.1.50 లక్షలు తోటి వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నాను. దీంట్లోనే నాకు సంతోషం.. సంతృప్తి ఉన్నాయి అని హనన్ చెప్పింది.

388
Tags

More News

VIRAL NEWS