స్మార్ట్ మిర్రర్ వస్తున్నది!


Tue,August 21, 2018 01:06 AM

ఆధునిక పోకడ

Aadhunika-Pokada
కొత్త దుస్తులను కొనుగోలు చేసే ముందు ప్రతీ ఒక్క దానినీ ట్రయాల్ చేసి మనకు సరిపోతాయో లేదో చూసుకోవాల్సిన అవసరం లేకుండా హైటెక్ మిర్రర్‌లు వస్తున్నాయి.
అమెరికా, జపాన్‌లకు చెందిన రెండు కంపెనీలు ఈ రకమైన హైటెక్ మిర్రర్‌లను అభివృద్ధి పరుస్తున్నాయి. జపాన్‌లోని ఎంటర్ డిజిటల్ ఫేషన్, క్యాలిఫోర్నియా (అమెరికా) లోని సాల్వడార్ నిస్సీ విల్కోవ్‌స్కీ కంపెనీలు వాటికి రూపకల్పన చేస్తున్నాయి. సాల్వడార్ సంస్థ దీనిని మెమొరీ మిర్రర్ అని పిలుస్తున్నది. ఈ తెలివైన అద్దం మామూలు మిర్రర్‌లాగానే గోడకు వేళ్లాడుతూనే ఉంటుంది. కానీ, దానిపైన చిన్న కెమెరా ఉంటుంది. కంప్యూటర్‌తో అనుసంధానమైన ఈ మిర్రర్‌కు ఒకసారి మన ఫొటోలను వివిధ భంగిమల్లో లోడ్ చేస్తే సరి. ఇక, ఏ డ్రెస్‌లోనైనా మనల్ని అందులో దర్శించుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. మెమొరీ మిర్రర్‌లో కైనెక్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ టెక్నాలజీని కూడా వాడినట్లు వారు చెబుతున్నారు. వీటికి వాడే కైనెక్ట్ కెమెరా పనితనం త్రీడీ నమూనాలను పోలి ఉంటుంది. ఇక, ఒక్క దుస్తులతోనే ఊరుకోకుండా నెక్లెస్‌లు, చెవి రింగులు వంటి ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులు వంటి వాటిని కూడా ధరిస్తే ఎవరు, ఎలా ఉంటారో చూపించే సౌలభ్యం స్మార్ట్ మిర్రర్‌లో కల్పించనున్నట్టు చెబుతున్నారు.

261
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles