స్మార్ట్ ఫోన్స్‌తో జర జాగ్రత్త


Mon,December 10, 2018 02:28 AM

-రాత్రివేళ స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగించడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.
smart-phone
ఇపుడు మార్కెట్లో లభ్యమయ్యే ప్రతి కొత్త రకం స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ఇ-రీడర్స్‌లో బ్లూ లైట్ ఎక్కువ. అందుకే ఎక్కువ కాంతివంతంగా ఉంటున్నాయి. అసలు సమస్య అoతా ఈ బ్లూ లైట్ వల్లే. కాంతి అనేది ఏడు వర్ణాల్లో వేరు వేరు తరంగ దైర్ఘ్యాలతో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తయారీలో బ్లూలైట్ ఉపయోగిస్తారు. బ్లూ లైట్ ఎక్కువ ప్రీక్వేన్సీతో ఉంటుంది. అందుకే స్క్రీన్ ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. మనం రాత్రి పూట నిద్రపోవడానికి ముఖ్యoగా శరీరంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ కారణం. సాయంత్రం నుంచి మన శరీరం మెల్లగా మెలటోనిన్ అనే హార్మోన్ ని విడుదల చేసి మనం ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది. మనం రాత్రి పూట స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగిస్తే ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఫై ప్రభావం చూపుతుంది. మెలటోనిన్ విడుదలను తగ్గిస్తుంది. దీంతో మనం పడుకుంటే వెంటనే నిద్ర పట్టదు. దీంతో మనం నిద్ర కోల్పోతాం. లండన్‌కి చెందిన వైద్యులు స్మార్ట్ ఫోన్స్ తయారుచేసే సంస్థలు ప్రత్యేకంగా బెడ్ టైం మోడ్ అనే ఆప్షన్‌ని తయారుచేయాలి అని సూచిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని స్లీప్ అవేర్ అప్సన్స్ (sleep aware options) ని కూడా డెవలప్ చేయాలి. దీని వల్ల స్మార్ట్ ఫోన్స్ ని మనం రాత్రి వేళలో ఉపయోగించినపుడు దాని నుండి వచ్చే బ్లూ లైట్ ని ఆటోమేటిక్ గా నియంత్రిస్తుందని వారంటున్నారు. అందుకే మంచి నిద్ర కోసం స్మార్ట్ ఫోన్స్ కి రాత్రి వేళలో దూరంగా ఉంటే మంచిది.

594
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles