స్మార్ట్‌ఫోన్‌తో రక్తపోటు చెకింగ్


Tue,September 4, 2018 03:02 AM

Aadhunika-Pokdada
స్మార్ట్‌ఫోన్ వల్ల సంభవించే అద్భుతాలు రాన్రాను మనిషి సాంకేతిక విశ్వరూపానికి నిదర్శనం కానున్నాయి. మన ఒంట్లోని రక్తపోటు (బ్లడ్‌ప్రెషర్)ను చెక్ (కొలిచే) చేసుకొనే సౌకర్యం ఇక ముందు సెల్‌ఫోన్‌లో అందుబాటులోకి రానుంది.


చక్కగా చేతి వేలుతో సెల్‌ఫోన్‌మీది నిర్దిష్ట ప్రదేశంపై చిన్న ఒత్తిడి కలిగించడం ద్వారా దాని స్క్రీన్‌పై మన రక్తపోటు (బి.పి) కొలతలను పొందవచ్చునని ఎలక్ట్రానిక్ నిపుణులు అంటున్నారు. అమెరికాకు చెందిన మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ మేరకు ఒక నమూనా పరికరాన్ని (ప్రొటోటైప్) అభివృద్ధి పరిచారు. సెల్‌ఫోన్ వినియోగం విస్తృతంగా పెరిగిన ఈ తరుణంలో దానివల్ల లభించనున్న అనేక సదుపాయాలలో ఇదొకటి కానుంది. సెల్‌ఫోన్‌పై మన వేలుతో కలిగించే చిన్నపాటి ఒత్తిడితో ఇక ముందు దానిపై మన రక్తపోటు వివరాలను కనుగొనగలమని పై పరిశోధకులు అంటున్నారు. ఫోన్ వెనుక వైపు కెమెరా కింది భాగంలో పై పరికరాన్ని అమరుస్తారు.
Aadhunika-Pokada
ఇది రెండు భాగాలుగా పనిచేస్తుంది. ఒకటి: ఫొటోప్లెతిస్మొగ్రఫీ (Photoplethysmography - PPG) సెన్సర్, రెండవది: పలుచని ఫిల్మ్‌తో కూడిన ట్రాన్స్‌డ్యూసర్ (Transducer). ఇవి సదరు వ్యక్తి బిపిని కనుగొని యాప్‌ద్వారా సెల్‌ఫోన్‌కు అందిస్తే, అవి స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. దీనిని తొలిసారిగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 మోడల్ స్మార్ట్‌ఫోన్‌కు కలిగిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఐతే, ఈ పిపిజిని ఇప్పటికే గుండెపోటును కొలవడానికి కూడా వినియోగిస్తున్నారు.

605
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles