స్ట్రెస్ రిలీఫ్-15


Sat,May 11, 2013 12:28 AM

తీవ్రమైన ఎండలతో అందరూ అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో శరీరాన్ని, మనసునూ చల్లబరిచే శక్తి ప్రాణాయామానికి ఉంది. తీవ్రమైన దప్పిక, వడదెబ్బల నుంచి తప్పించుకునే సులభమైన ఉపాయం శీతలీ, సీత్కారీ ప్రాణాయామం. అలాగే విపరీతమైన ఒత్తిడిని దూరం చేసే ఓంకార మెడి ఈ వారం మీకోసం...

shitali శీతలీ ప్రాణాయామం
స్థిరంగా, ప్రశాంతమైన మనస్సుతో ఒక ప్రదేశంలో కూర్చోవాలి. నాలుకను నోటి బయటకు తీసుకురావాలి. మధ్యలో ఒక కాలువలా వచ్చేలాగా నాలుక రెండు వైపులా మడవాలి. ఇప్పుడు నాలుకలో నుంచి నోటిద్వారా గాలి నెమ్మదిగా పీల్చుకుని, ముక్కుద్వారా వదిలివేయాలి. గాలి పీల్చేటప్పుడు నోరు, నాలుక అంతా కూడా చాలా చల్లగా, మంచు ముట్టుకున్నట్లుగా ఉంటుంది. మనసును కూడా చల్లబరుస్తుంది. ఆసనాలు వేసిన తర్వాత ఈ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయవచ్చు.

ఉపయోగాలు
- ఇది శరీరాన్ని, మనసును చల్లబరుస్తుంది.
- మెదడును రిలాక్స్ చేస్తుంది.
- కండరాలను రిలాక్స్ చేసి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కాబట్టి నిద్రపోయేముందు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు.
- ఆకలి, దాహాన్ని అదుపులో ఉంచుతుంది.
- ఎసిడిటీని తగ్గిస్తుంది.
- బీపీ ఉన్నవారు చేస్తే మంచిది.
- జ్వరంగా ఉన్నప్పుడు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
- సెన్సిటివ్ టీత్ ఉన్నవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

sitkari సీత్కారీ ప్రాణాయామం (స్వదంత ప్రాణాయామం)
ఈ ప్రాణాయామంలో రెండు పెదాలను దూరంగా ఉంచి రెండు పలువరుసలను కలపాలి. నాలుకను మామూలుగా కానీ, అంగుటికి గానీ ఆన్చి ఉంచాలి. ఇప్పుడు పళ్లద్వారా నెమ్మదిగా గాలి పీల్చాలి. నోరు మూసివేసి ముక్కుద్వారా గాలిని బయటకు వదలాలి.

ఉపయోగాలు
- దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- నోటిలో ఉండే బ్యాక్టీరియాను తగ్గించి నోటి దుర్వాసనను పోగొడుతుంది.

ఈ రెండు ప్రాణాయామాలు చేసేప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు :
చలికాలంలో ఇది చేయకూడదు.
జలుబు ఉన్నప్పుడు కూడా చేయకూడదు.
లోబీపీ, ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్నవాళ్లు చేయకూడదు.

omkarameditation ఓంకార మెడి
స్థిరంగా ఒక చోట పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చోవాలి. ముందుగా కళ్ళు మూసుకోవాలి. చేతులు రెండూ ధ్యానమువూదలో ఉంచాలి. కొద్ది సేపు శ్వాస మామూలుగా తీసుకోవాలి. శరీరం, మనస్సు ప్రశాంతంగా అవుతుంది. అప్పుడు గాలి దీర్ఘంగా పీల్చుకొని, వదిలేటప్పుడు ఓం అనే ధ్వనితో గాలి మొత్తం బయటకు వదిలివేయాలి. ఓం అనే టప్పుడు అ........ ఉ.......... మ్.......... అనే ధ్వనిలో పదమును విడదీసి పలకాలి. ఇలా 10 నుంచి 20 సార్లు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు శరీరంలో సంభవించే వైబ్రేషన్స్‌ను గమనిస్తూ ఉండాలి. తర్వాత కొద్ది సమయం శ్వాస మామూలుగా తీసుకుంటూ ఉండాలి.

ఉపయోగాలు
- మనస్సు ప్రశాంతమవుతుంది.
- ఏకాక్షిగత పెరుగుతుంది.
- మెదడును స్థిమితపరుస్తుంది.
- రోజూ ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.

సంగీత అంకత
యోగా ట్రైనర్, బ్యూటీ ఎక్స్‌పర్ట్, 9705665266

2423
Tags

More News

VIRAL NEWS