స్ట్రీట్ ఫుడ్ లాగించేది!


Wed,May 30, 2018 11:13 PM

సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు పయనమైంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడూ తెలుగు సినిమాల్లోనూ మెరిసిపోతున్నది తాప్సీ పన్ను. బొద్దుగుమ్మ కాస్త ముద్దుగుమ్మగా తయారైన ఆమె ఇష్టాయిష్టాల లిస్ట్ ఇది..
tapsee
నేను ఢిల్లీవాసినని తెలుసు కదా! అందుకే ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తినేదాన్ని. ఇప్పటికీ అక్కడికి వెళితే కచ్చితంగా ఏదో ఒకటి లాగించకుండా రాను. నాకు దనీష్ కుకీస్, పేస్ట్రీస్ అంటే కూడా చాలా ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్‌ల్లో ఫ్రెండ్స్‌తో కలిసి చోలే, బిర్యానీ, షవార్మా, మోమోస్ వీటిలో ఏదో ఒకటి రోజూ తినేవాళ్లం. అంతేకాదు.. చోలే పూరీ, కచోరీ, పప్రీ చాట్ కూడా ఢిల్లీలో చాలా ఫేమస్. ఇక ఇంట్లో అమ్మ చేతి పరాటాలంటే ప్రాణం. బయటకు వెళితే చైనీస్ వంటకాలను ఇష్టపడుతాను. ఇంతలా తినేదాన్ని కాబట్టే ముందు బొద్దుగా ఉన్నాను. సినిమాల్లోకి వచ్చాక కాస్త డైట్‌లో మార్పులు వచ్చాయి. బ్రేక్‌ఫాస్ట్ నేను ఎక్కువ తీసుకుంటా. నా ఉద్దేశంలో బ్రేక్‌ఫాస్ట్ కింగ్. పరాటా, బ్రెడ్ పిజ్జా, ఫ్రెంచ్ టోస్ట్, ఆలూ కూరతో పూరీలు ఇలా మారుతుంటుంది బ్రేక్‌ఫాస్ట్ మెనూ. మధ్యాహ్నం.. రోటీ, పప్పు, ఏదైనా కూర అంతే! రాత్రి మాత్రం పప్పు, కూరలు మాత్రమే తింటాను. అది కుదురకపోతే సూప్ లేదా సలాడ్‌తో సరిపెట్టుకుంటా. ఇంతలా తినేదాన్ని వంట కూడా బాగా చేస్తానండోయ్! నేను బాగా చేసేది చపాతీలు, రాజ్మా కూర. నేను తినే దగ్గర అడ్వెంచర్‌లు చేయాలనుకోను. ఎవరైనా బాగుందని చెబితే తప్ప కొత్త వంటకాల జోలికి వెళ్లను.

1344
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles