స్టెయిన్‌లెస్ స్టీల్ మెరుపు కోసం..


Sun,August 12, 2018 11:33 PM

స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెల మీద మరకలు, జిడ్డు, వేలిముద్రలు అంత తొందరగా వదిలిపోవు. దాంతో స్టీల్ మెరుపు తగ్గుముఖం పడుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే వాటికి మునుపటి మెరుపు సంతరించుకొనేలా చేయొచ్చు..
steel
-కొన్ని చుక్కల బేబీ ఆయిల్‌ని తీసుకొని స్టెయిన్ లెస్ స్టీల్‌పై కొంచెంసేపు రుద్దాలి. అలా చేయడం వల్ల స్టీలు మీద ఉండే మరకలు పోయి తళతళలాడే మెరుపు సొంతం అవుతుంది.
-ముందుగా వెనిగార్‌ను స్ప్రే బాటిల్‌లోకి తీసుకోవాలి. ఈ గిన్నెలపై కొంచెం స్ప్రే చేయాలి. తరువాత మెత్తటి బట్టతో తుడిస్తే శుభ్రంగా ఉంటుంది. ఇది పాత్రలలోని మురికిని తొలిగించడానికి కూడా ఉపయోగ పడుతుంది.
-పాత్రలలో మాడిపోయిన మొండి మరకలను తొలిగించడానికి స్టీల్ వూల్‌తో రబ్ చేయాలి. అప్పుడు ఎలాంటి స్క్రాచెస్ పడకుండా మరకలు తొలిగిపోయి పాత్రలు తళతళా మెరిసిపోతాయి.
-స్టీలు పాత్రల మీద పేరుకుపోయిన దుమ్ము, ఆహారాన్ని తొలిగించడానికి పళ్లు తోముకొనే బ్రష్‌తో కొంచెం సేపు రుద్దాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చాలు.
-వేలిముద్రలను తొలిగించడానికి విండెక్స్ వంటి గ్లాస్ క్లీనర్‌ని స్ప్రే చేయాలి. తరువాత టవల్‌తో తుడిస్తే గిన్నెలు మెరిసిపోతాయి.
-క్లబ్ సోడాతో చారలున్న పాత్రలను రుద్దాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడుగాలి. ఇలా చేయడం వల్ల పాత్రలు కొత్త మెరుపుతో మెరుస్తాయి.

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles