సౌరశక్తితో నడిచే తొలి రైలు


Tue,August 21, 2018 01:08 AM

ప్రపంచ రికార్డు

Prapancha
సౌరశక్తితో నడిచే మొట్టమొదటి రైలు ఆస్ట్రేలియాలో పట్టాలెక్కింది. అక్కడి బైరాన్ బే రెయిల్‌రోడ్ కంపెనీ ఈ కొత్త సాంకేతికతను విజయవంతంగా ప్రవేశపెట్టింది.
పునరుత్పాదక ఇంధనాలలో సౌరశక్తి ప్రధానమైనది. రవాణా రంగంలో వీటి వాడకం వల్ల చాలావరకు వాతావరణ కాలుష్యానికి కళ్లెం వేయవచ్చు. అయితే, వివిధ వాహనాలకు సౌరశక్తి సాంకేతికతను అభివృద్ధి పరచుకోవలసి ఉంది. ఈ తరుణంలోనే పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి రైలును ఆస్ట్రేలియాలో విజయవంతంగా నడిపారు. అక్కడి రైల్వే కంపెనీ (బీబీఆర్‌సీ- Byron Bay Railroad Company) నిపుణులు దీనిని ఒక పాతకాలపు రైలు బండి (వింటేజ్ ట్రెయిన్)ని ఆధునీకరించడం ద్వారా సాధించారు. కిందటేడాది చివర్లోనే ఈ రైలును నిర్దిష్ట దూరం పాటు ప్రయోగాత్మకంగా నడిపినట్టు ప్రకటించారు. ట్రెయిన్ పై భాగంలోనే కాకుండా అది నిలిచే ప్రాంతాల (స్టాప్స్)లోను సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పరిచి ఇంజిన్‌కు కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చారు. ఐతే, ఎందుకైనా మంచిదని, అదనంగా బ్యాటరీ ఇంజిన్‌ను కూడా ప్రయోగ ప్రయాణంలో ఉంచారు. కానీ, వారికి దానితో పని పడలేదు.
Prapancha-record
దీంతో ఈ ట్రెయిన్ ప్రపంచంలోనే పూర్తిగా సౌరశక్తితోనే నడిచిన మొట్టమొదటి రైలుగా చరిత్ర సృష్టించింది. సోలార్ పవర్‌తో మూడు కిలోమీటర్ల మేర దూరాన్ని అది సాఫీగా ప్రయాణించింది. కాగా, మున్ముందు సౌరశక్తి రైళ్లు నడుపడానికి ఆయా దేశాలు తమ వంతు కృషి చేయాల్సి ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

856
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles