సోలో బతుకే సో బెటర్!


Sat,August 4, 2018 11:31 PM

ఆడ మగ పెండ్లి చేసుకోవడం చూశాం. ఈ మధ్యకాలంలో ఆడ-ఆడ, మగ-మగ పెండ్లిళ్లు కూడా కామనయ్యాయి. కానీ ఈ అమ్మాయి తనని తాను పెండ్లి చేసుకుంది. పైగా పలుచోట్లకి వెళ్లి సోలో హానీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్నది.
solo
లిండా డోక్టర్.. ఒక భగ్న ప్రేమికురాలు. ఎంతో ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి బ్రేకప్ అన్నాడు. దాంతో ఆమె చాలారోజుల వరకు కోలుకోలేకపోయింది. ఎవరిని ప్రేమించినా చివరికి ఏదో ఒకరోజు బ్రేకప్ అనే మాట వినాల్సి వస్తుందని తనని తాను ప్రేమించుకోవడం, దానినే అలవాటు చేసుకోవడం మొదలుపెట్టింది. అందుకే తనని తాను పెండ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకొని గత సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున పెండ్లి చేసుకున్నది. అది కూడా గోల్డ్ కోస్ట్ బీచ్‌లో అద్దం పట్టుకొని తనని తాను చూసుకుంటూ పెండ్లి ప్రమాణాలు చేసింది. ఇక అప్పటి నుంచి దేశవిదేశాలు తిరుగుతూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది. దీంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరిగింది. నేను బంధాలకు ప్రాధాన్యమిస్తాను. అలాగే నాకు అనుబంధాల గురించి కూడా తెలుసు. దాన్ని ఎలా నిలుపుకోవాలో, ఎలా మెలగాలో అన్నీ తెలుసు. కానీ నా జీవితంతో పెనవేసుకునే బంధం నాతోనే ఉందని అర్థమయింది. అందుకే నన్ను నేను ప్రేమిస్తున్నాను అంటున్నది లిండా. ఇప్పుడు ఈ సోలో హానీమూన్ చేస్తూ ఒక ఇల్లు, ఒక అడ్రస్ అంటూ ఏమీ లేకుండా హాయిగా తిరుగుతున్నది. సోలో బతుకు సో బెటర్ అన్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నది.

372
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles