సొరియాసిస్ - హోమియో వైద్యం


Wed,August 3, 2016 12:48 AM

దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సొరియాసిస్ ముఖ్యమైంది. ఇది స్త్రీ పురుష బేధం లేకుండా అందరిని బాధించే చర్మసమస్య ఇది. ఇది శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా, సాంఘికంగా కూడా ఇబ్బంది కలిగిస్తుంది. చర్మం పైన దురదతో కూడిన వెండి రంగు పొలుసులపొరలు కనిపిస్తాయి. ఈ పొరలు ఎర్రగా కందిపోయి గాని వాపుతో కానీ ఉండవచ్చు. కేవలం చర్మం మాత్రమే కాకుండా గోళ్లు కూడా ఈ వ్యాధి బారిన పడవచ్చు. మొదట సొరియాసిస్ మచ్చలు ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించినా, సమయం గడిచే కొద్ది ఈ మచ్చల పైన తెల్లని పొలుసులు మందంగా పేరుకు పోతాయి. పొలుసులను తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి.
దురద ప్రధాన లక్షణం కాదు కానీ వాతావరణం చల్లగా ఉండి తేమ తగ్గినపుడు లేదా ఇన్‌ఫెక్షన్లు తోడైనపుడు గానీ తీరుబడిగా ఉన్నపుడు గానీ దురద ఎక్కువ అవుతుంది. బాధితుల్లో 10-20 శాతం మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా వస్తాయి.

ఎలా వస్తుంది?


మామూలుగా ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కణాలను బహిర్గత పరుస్తాయి. సొరియాసిస్ వ్యాధిలో ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మపు కణాలు వేగంగా తయారై మూడు, నాలుగు రోజులకే వెలుపలకు చేరుకుంటాయి. అదనపు కణ సముదాయానికి పోషకతత్వాతలను అందించే నిమిత్తం రక్తసరఫరా పెరుగుతుంది. దీంతో చర్మం పైన ఎర్రని పొర తయారవటమూ, పొలుసులు ఏర్పడమూ జరుగుతాయి.

ఎందుకు?


వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటం వల్ల సొరియాసిస్ వస్తుంది. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిశోధనలు చెబుతున్నాయి. సూక్ష్మ జీవులు శరీరంమీద దాడి చేసినపుడు వాటి నుంచి రక్షించడానికి మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఉంటుంది. దీనినే వ్యాధి నిరోధక శక్తి అంటాము. ఈ నేపథ్యంలో అనుబంధ అంశంగా ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. సొరియాసిస్‌లో ఈ వ్యాధి నిరోధక శక్తి అపక్రమంగా తయారవుతుంది. ఇది శరీరంలోని చర్మ కణాల మీద దాడి చెయ్యడం వల్ల చర్మకణాల్లో ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. ఫలితంగా చర్మ కణాలు అనియతంగా పెరిగి పొలుసులుగా తయారవుతాయి.
homeopathy

రకాలు


సొరియాసిస్ లక్షణాలను బట్టి రకాలుగా వర్గీకరించారు. సొరియాసిస్ వల్గారిస్, గట్టెడ్ సొరియాసిస్, ఫుస్టులార్ సొరియాసిస్, ఎరిత్రోడెర్మిల్ సొరియాసిస్

హోమియోపతి చికిత్స


ఏదైతే వ్యాధికి కారణమవుతుందో అదే చికిత్సకు ఉపయోగ పడుతుంది అనే ప్రకృతి సహజ సిద్ధాంతం మీద హోమియోపతి వైద్య విధానం ఆధారపడి ఉంటంది. ఒకే రకమైన ప్రేరణ లేదా ప్రేరకానికి భిన్న వ్యక్తులు భిన్న భిన్న రకాలుగా స్పందిస్తారనే అస్తివాదం పైన హోమియోపతి ఆధారపడి ఉంటుంది. దీన్నే మూర్తిత్వ వక్తిత్వమంటారు. హోమియోపతికి మాత్రమే సంబంధించిన విలక్షణ అంశమిది. సొరియాసిస్‌కు సాధారణంగా అర్సెనికం అల్బం, సల్ఫర్, కాలిఆర్సా, సోరినమ్, మెజీరియం, పెట్రోలియం వంటి మందులను వాటి వాటి లక్షణాలకనుగుణంగా వైద్యులు సూచిస్తుంటారు. అయితే వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది.
murali

2051
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles