సొరియాసిస్‌కు పక్కా వైద్యం


Wed,April 12, 2017 12:01 AM

సొరియాసిస్ చర్మం మీద కనిపించే సమస్య అయినప్పటికీ ఇది శరీరంలోపల విస్తరించే వ్యాధి. ఈ క్రమంలో శరీరంలోని సప్తధాతువులు ఒక్కొక్కటిగా క్షీణిస్తూ వెళ్తాయి. ధాతువులు క్షీణించే కొద్దీ శరీరంలో వాత ప్రకోపం పెరుగుతుంది. ఇది నాడీ వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుంది. గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలకు మూలం కావడమే కాదు దేహక్రియలన్నీ కుంటుపడేలా చేస్తుంది. సొరియాసిస్‌తో ఎముకలకు సంబంధించిన అస్థిధాతువు కూడా క్షీణించడంతో వెన్నెముక సమస్యలు, కీళ్ల సమస్యలు మొదలవుతాయి. బాహ్యంగా చేసే పంచకర్మ చికిత్సలతో పాటు అంతర చికిత్సలు కూడా ఇక్కడ ఎంతో కీలకం. అందుకే సొరియాసిస్ నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే పంచకర్మ చికిత్సలూ, ఔషధ చికిత్సలూ సమాంతరంగా సాగవలసిందే.
ayur

మూలాల్లోకి చొచ్చుకు పోతుంది..


సొరియాసిస్ సప్తధాతువులనే కాదు, సమస్త శరీర వ్యవస్థలనూ ధ్వంసం చేసే తత్వం కలిగి ఉంటుంది. ఈ దాతువులు క్షీణిస్తూ వెళ్లే కొద్ది శరీరంలో వాతం పెరుగుతుంది. ఒక్క వాతం సంతులనం కోల్పోతే మిగిలిన పిత్తం, కఫం కూడా సంతులనం కోల్పోతాయి. అయితే చికిత్సా విధానాలతో ఒక్క వాతాన్ని తిరిగి సాధారణ స్థితికి తెస్తే, పిత్త కఫాలు కూడా సాధారణ స్థితికి వస్తాయి. అందుకే ఆయుర్వేదం వాత నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది.

నాడులు దెబ్బతింటే?


మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో సొరియాసిస్ రోగుల్లో నిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది. ఈ శక్తి తగ్గిపోవడం వల్ల శరీరంలోని ఇతర వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. ప్రత్యేకించి నాడీ వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. శరీరంలోని ప్రొటీన్ అంతా మృతకణాలుగా బయటకు వెళ్లడం మూలంగా సహజంగానే నాడులు చచ్చుబడిపోతాయి. సొరియాసిస్ కారణంగా ఒత్తిడి తీవ్రత పెరిగినపుడు హార్మోన్లలో కీలకమైన అడ్రినలిన్ గ్రంథి దెబ్బతింటుంది. అస్థిధాతువులు క్షీణించడం వల్ల సొరియాటిక్ ఆర్థరైటిస్ మొదలవుతుంది. నాడీ వ్యవస్థను దెబ్బతీసే ఈ సొరియాసిస్ వ్యాధి సరైన వైద్య చికిత్సలు అందక దీర్ఘకాలం కొనసాగినపుడు కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా మొదలు కావచ్చు. ముఖ్యంగా నైపుణ్యం, సామర్థ్యం తగ్గిపోతాయి.
ramakrishna

ఆయుర్వేదంతో అంతా మేలే!


కేవలం బాహ్య చికిత్సలతో సొరియాసిస్‌కు పరిపూర్ణ వైద్యం అందదు. సొరియాసిస్‌కు కారణమైన విషపదార్థాలను ముందు పంచకర్మ చికిత్సలద్వారా తొలగించాలి. ఆతర్వాత ధాతు క్షయాన్ని నివారించే ఔషధాలు కూడా ఇవ్వాలి. వమనం, విరేచన కర్మల ద్వారా శరీరంలోని మలినాలన్నీ తొలగిస్తే వాతం నియంత్రణలోకి వస్తుంది. తర్వాత పిత్త, కఫాలు కూడా అదుపులోకి వస్తాయి. అప్పుడే సొరియాసిస్ సమూలంగా తొలగిపోతుంది. ఆయుర్వేద చికిత్సలు మొదలైన 25 రోజులకే సొరియాసిస్ మచ్చలు బాగా తగ్గిపోతాయి. ఆ తర్వాత వ్యాధిని సమూలంగా తొలగించడానికి మరో 3,4 మాసాలపాటు కడుపులోకి ఇచ్చే ఔషధాలు తీసుకోవాలి. వీటితో సొరియాసిస్ వల్ల వచ్చిన ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆయుర్వేదం సొరియాసిస్‌ను సమూలంగా, శాశ్వతంగా తొలగించి తీరుతుంది. వైద్య చికిత్సలు పూర్తి అయిపోయిన తర్వాత శరీరం మీద సొరియాసిస్ ఛాయలే కనిపించవు.

711
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles