సొంతింటి ఎంపిక.. సులువే ఇక!


Fri,August 17, 2018 11:27 PM

-424 ఎకరాల్లో లగ్జరీ ఫ్లాట్ల ప్రాజెక్టులు
-నిర్మాణంలో ఉన్నవి.. 19,500 ఫ్లాట్లు
-అపర్ణా అభివృద్ధి చేస్తున్న ఫ్లాట్లు.. 5,701
-శంషాబాద్‌లో శరవేగంగా రాంకీ ఎస్టేట్స్ విల్లాలు
-అశోకా బిల్డర్స్.. ఆహ్లాదకర విల్లాలు, ఓపెన్ ప్లాట్లు
-15.5 ఎకరాల్లో ఆదిత్యా అపార్టుమెంట్లు
-నేడు, రేపు శిల్పాకళావేదికలో..
-ఉదయం 10 నుంచి సా. 6 గంటల దాకా
-ప్రతి గంటకు సర్‌ప్రైజ్ గిఫ్టు

సొంతింటిని ఎంపిక చేసుకోలేక తర్జన భర్జన పడుతున్నారా? ఏ ప్రాంతంలో కొనుక్కోవాలో తెలియక తికమక పడుతున్నారా? ఏయే ప్రాజెక్టు నిర్మాణం ఏ స్థాయిలో ఉంది? ఎప్పటిలోపు అందజేస్తారనే విషయాలు తెలుసుకోవాలని ఉందా? ఏయే ప్రాజెక్టులో ఫ్లాట్లు ఎంతెంత విస్తీర్ణంలో ఉన్నాయి? ఏ ప్రాజెక్టులో ఎంత రేటుందో కనుక్కోవాలని ఆరాట పడుతున్నారా? అయితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. శిల్పాకళా వేదికలో నేడూ, రేపూ జరిగే ప్రాపర్టీ షోకు విచ్చేయండి. మీ కలల గృహానికి సంబంధించిన సమస్త విషయాలు తెలుసుకోండి. ఒక్కసారి ఈ షోకు విచ్చేస్తే చాలు.. ఈ ఏడాదిలో తప్పకుండా ఓ సొంతింటివారవుతారు.
House
హైదరాబాద్‌లో సొంతింటి కొనుగోళ్ల సంబురాలు ఆరంభమయ్యాయి. ఎక్కడో తెలుసా?మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో! కర్టసీ నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షో!! నేడూ, రేపూ జరిగే ఈ ప్రాపర్టీ షోలో.. నగరానికి చెందిన అత్యుత్తమ నిర్మాణ సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ సంస్థలన్నీ నగరంలోని నలువైపులా.. దాదాపు 424 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఇందులో కొన్ని సంస్థలు అందుబాటు ధరలో ఫ్లాట్లను నిర్మిస్తే.. మరికొన్ని లగ్జరీ గృహాలను కడుతున్నాయి. ఇంకొన్ని ఖరీదైన ఫ్లాట్లను ప్రకటించాయి. భవిష్యత్తులో పిల్లల ఉన్నత విద్యకు లేదా వారి పెళ్లిళ్లకు అక్కరకొచ్చేలా నేడే ఒక ప్లాటు మీద పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? అయితే, మీలాంటి వారికోసమే పలు సంస్థలు తమ లగ్జరీ వెంచర్లను సిద్ధం చేశాయి. కాస్త ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదు.. విల్లా తీసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారా? వీటికి సంబంధించిన సమాచారం కూడా మీకు చిటికెలో లభించే ప్రాంతమే.. శిల్పాకళావేదిక కర్టసీ నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షో.

అపర్ణా.. ఆధునిక ప్రాజెక్టులు

హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుపరిచితమైన అపర్ణా కన్‌స్ట్రక్షన్స్.. హైదరాబాద్, అమరావతిలో కలుపుకుంటే దాదాపు పది ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. అందుబాటులో లగ్జరీ ఫ్లాట్లు, ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలు, హై ఎండ్ విల్లాలు, అత్యుత్తమ వెంచర్లను అభివృద్ధి చేస్తున్నది. మొత్తం 102.25 ఎకరాల్లో దాదాపు 5,701 ఫ్లాట్లను కేవలం హైదరాబాద్‌నే నిర్మిస్తున్నది. ఇక గుండ్లపోచంపల్లి, పుప్పాల్‌గూడలో 88 విల్లాలను నిర్మిస్తున్నది. అమరావతి చేరువలోని తాడేపల్లి వద్ద 9.29 ఎకరాల్లో 612 లగ్జరీ ఫ్లాట్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మొత్తం పది ప్రాజెక్టుల్లో మూడు ప్రాజెక్టులు ప్రస్తుతం సిద్ధమవ్వగా.. మరో మూడు ప్రాజెక్టులను ఈ ఏడాది చివర్లో కొనుగోలుదారులకు అందించడానికి ప్రణాళికల్ని రచించింది. రెండు ప్రాజెక్టుల్ని 2019లో.. నలగండ్ల, తాడేపల్లి (గుంటూరు) నిర్మాణాల్ని 2021లో అందజేస్తుంది.

రాంకీ డిస్కవరీ

అందుబాటు ధరలో లగ్జరీ ఫ్లాట్లనే కాకుండా.. హైరైజ్ అపార్టుమెంట్లు, ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను నిర్మించడంలో రాంకీ ఎస్టేట్స్ నిత్యం ముందంజలో ఉంటుంది. ఈ సంస్థ తాజాగా శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని రాంకీ డిస్కవరీ సిటీలో గ్రీన్‌వ్యూ అపార్టుమెంట్స్, ద హడ్డల్ అనే అందమైన విల్లా ప్రాజెక్టును నిర్మిస్తున్నది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించాలని కోరుకునేవారికి 980 చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడా ఈ సంస్థ ఫ్లాట్లను అందిస్తున్నది. పైగా, రేటు కూడా చదరపు అడుక్కీ కేవలం రూ.2,999గా నిర్ణయించింది. కాస్త ఖరీదైన జీవనాన్ని కోరుకునేవారి కోసం ప్రత్యేకంగా విల్లాలను చేపట్టింది.

అశోకా.. అత్యుత్తమ విల్లాలు

నగరవాసులకు సుపరిచితమైన నిర్మాణ సంస్థ.. అశోకా బిల్డర్స్. ఈ కంపెనీ కొంపల్లిలో ఆ-లా-మైసన్ లగ్జరీ విల్లా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నది. దాదాపు అరవై ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో.. సుమారు 220 విల్లాలను చేపట్టింది. ఖరీదైన విల్లాలకు మారుపేరుగా

నిలిచే ఈ ప్రాజెక్టును 2018 అక్టోబరులో కొనుగోలుదారులకు అందజేయడానికి అశోకా బిల్డర్స్ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట్ దాటిన తర్వాత వచ్చే మోకిలలో 30 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అశోకా సెంట్రల్ పార్కును అభివృద్ధి చేస్తోంది. ఇందులో వచ్చే ప్లాట్ల సంఖ్య.. దాదాపు 200. ఒక్కో ప్లాటు సైజు 267 గజాల నుంచి 1000 గజాల దాకా ఉంటుంది.

15.5 ఎకరాల్లో ఆదిత్యా నిర్మాణాలు..

ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ప్రస్తుతం మూడు లగ్జరీ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నది. హైటెక్ సిటీలో ఆదిత్యా క్యాపిటల్ హైట్స్ ప్రాజెక్టును 5 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్నది. ఇందులో వచ్చేవి దాదాపు 336 ఫ్లాట్లు. ఈ నిర్మాణాన్ని రెండున్నర ఏండ్లలో కస్టమర్లకు అందజేయడానికి సంస్థ ప్రణాళికలు రచించింది. షేక్‌పేట్‌లో ఎంప్రెస్ టవర్స్, ఎంప్రెస్ టవర్స్ అనెక్స్ ప్రాజెక్టులను సుమారు 10.5 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నది. ఈ రెండింటినీ కలుపుకుంటే.. ఈ సంస్థ మొత్తం అభివృద్ధి చేసేది.. దాదాపు 1304 ఫ్లాట్లు. ఇందులో ఎంప్రెస్ టవర్స్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉండగా.. ఎంప్రెస్ టవర్స్ అనెక్స్‌ను రెండున్నర ఏండ్లలోపు కొనుగోలుదారులకు అందజేస్తామని ఆదిత్యా కన్‌స్ట్రక్షన్స్ చెబుతున్నది.

-తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనానికి మారుపేరుగా నిలిచే సంస్థ అంటే.. ప్రతిఒక్కరికీ గుర్తుకొచ్చేది ప్రగతి గ్రూపు. ఈ సంస్థ శంకర్‌పల్లిలో అభివృద్ధి చేసిన ప్రగతి రిసార్ట్స్.. ప్రపంచంలో పచ్చదనానికే ప్రముఖ ప్రాజెక్టుగా నిలిచింది. పర్యావరణానికి పెద్దపీట వేసే ప్రగతి గ్రూప్.. యాదరిగిగుట్ట, మేడ్చల్‌లోనూ పచ్చటి వెంచర్లను అభివృద్ధి చేస్తున్నది. పచ్చటి వాతావరణంలో ప్రశాంతంగా నివసించాలని కోరుకునేవారికి ప్రగతి గ్రూప్ వెంచర్లు ఇట్టే నప్పుతాయి.
-మై హోమ్ గ్రూప్, ఎన్‌సీసీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రాజపుష్ప ప్రాపర్టీస్, వర్టెక్స్ హోమ్స్, ఎస్‌ఎంఆర్ బిల్డర్స్, ఆర్‌వీ నిర్మాణ్, సైబర్ సిటీ డెవలపర్స్, ముప్పా ప్రాజెక్ట్స్, ఈఐపీఎల్ గ్రూప్, జనప్రియ ఇంజినీర్స్ వంటివి పలు ప్రాంతాల్లో అందుబాటు ధరలో లగ్జరీ ఫ్లాట్లు, ఖరీదైన నిర్మాణాల్ని చేపడుతున్నాయి. వర్టూసా లైఫ్ స్పేసెస్, సాయిసూర్య డెవలపర్స్, ఫార్చ్యూన్ బట్టర్‌ైఫ్లె సిటీ, ప్రైడ్ ఇండియా, పేరం గ్రూప్ వంటివి వెంచర్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రాపర్టీ షోకి బ్యాంకింగ్ పార్టనర్‌గా ఎస్‌బీఐ వ్యవహరిస్తున్నది.

353
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles