సైన్యంలో గూర్ఖా యువతులు


Sat,August 4, 2018 11:16 PM

గూర్ఖాలు అంటేనే భయం ఎరుగని యోధులని మనకు తెలిసిందే. బ్రిటన్ సైన్యంలో నేపాల్‌కు చెందిన గూర్ఖా పౌరులు ఎన్నో ఏండ్ల నుంచీ పనిచేస్తున్నారు. అయితే, మగవారితో సమానంగా సరిహద్దుల్లో గస్తీ కాసేందుకు నేపాల్‌కు చెందిన గూర్ఖా యువతులూ సిద్ధమవుతున్నారు.
Gurhka-Soldgers
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నేపాల్ నుంచి బ్రిటన్‌కు 1,12,000 మంది గూర్ఖాలు వెళ్లారు. యుద్ధంలో ఆ దేశం తరఫున పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం బ్రిటన్ సైన్యంలో పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న గూర్ఖాల సంఖ్య 3వేలు మాత్రమే. దీంతో తమ సైన్యంలోకి గూర్ఖా యువతులని చేర్చుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నది. అందుకు 2020ని లక్ష్యంగా ఎంచుకున్నది బ్రిటన్ ప్రభుత్వం. దీంతో గూర్ఖా యువతుల రిక్రూట్‌మెంట్ కోసం సిద్ధపడింది. దీంతో 18 యేండ్లు నిండిన గూర్ఖా యువతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సైన్యంలో కలిసి పనిచేసేందుకు ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన ఇద్దరు యువతులు తమ మనోగతాన్ని మీడియాతో పంచుకున్నారు. రోష్నీ, అలీషా అనే గూర్ఖా యువతులు 2020లో బ్రిటన్ సైన్యంతో కలిసి విధులు నిర్వర్తిస్తామని ధీమాగా చెబుతున్నారు. ఎందుకంటే పోటీలో ఉండే బరువు, ఎత్తు, చలాకీతనం తమకూ ఉన్నాయని అంటున్నారు. బ్రిటన్ సైన్యంలో చేరాలంటే 158 సెంటీమీటర్ల ఎత్తు, 50 కేజీలకు పైగా బరువు కచ్చితంగా ఉండాలి. 25 కేజీల ఇసుక బస్తాను ఎత్తుకొని పరుగు పందెంలో పాల్గొనాలి. ఇవన్నీ తమకు పెద్ద విషయమే కాదని, అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, ఇప్పటి నుంచే కఠిన శిక్షణ తీసుకుంటున్నామని చెబుతున్నారు.

460
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles