సైనస్‌కు హోమియో చికిత్స


Wed,July 13, 2016 12:56 AM

సైనసైటీస్ సమస్య ఇన్‌ఫెక్షన్ వల్ల వస్తుంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ముఖ్యంగా స్టెప్టోకోకస్ న్యుమోనియా, ఇన్‌ఫ్లూయేంజా వల్ల వస్తుంది.ఈ సైనసైటీస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్రావా నివారించడం మాత్రమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి తిరిగి రాకుండా చేస్తుంది.
ముఖంలో కళ్ల దగ్గర, ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగం ఇన్‌ఫెక్షన్లలో వాచి పోవుటనే సైనసైటిస్ అంటారు.

సైనస్ రకాలు
ఫ్రాంటల్, పారానాసల్, ఎత్మాయిడల్, మాగ్జీలరీ, స్పినాయిడల్. ఇవి కుడి ఎడమ రెండు జతలుంటాయి.

కారణాలు
-ఇన్‌ఫెక్షన్ బాక్టీరియా, వైరస్, ఫంగస్
-ఉపరితల శ్వాసకోశ వ్యాధులు
-అలర్జీ
-పొగ
-విష వాయువుల కాలుష్యం
-వాతావరణ కాలుష్యం
-అకస్మాత్తుగా వాతావరణ మార్పులు
-చలికాలం, వర్షాకాలం
-గాలిలో తేమ ఎక్కువగా ఉంటే సమయం
-మంచు ప్రదేశాలు
-జలుబు, గొంతునొప్పి
-టాన్సిల్స్ వాపు
-రోగనిరోధక శక్తి తగ్గినపుడు

వ్యాధి లక్షణాలు
ముఖంలో బారంగా ఉండడం, తలనొప్పి, బరువు, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కు మూసుకుపోవడం, ముక్కులో దురద, కారడం, గొంతు గరగర, దగ్గు, జలుబు, చెవిలో చీము, కోపం, మానసిక ైస్థెర్యం కోల్పోవటం, అలసట, విసుగు, పనిపై శ్రద్ధ లేకండుట, హోరుదగ్గు

వ్యాధి నిర్ధారణ
ఎక్స్‌రే, సీటీ స్కాన్
ఇతర పరిణామాలు -దీర్ఘకాలికంగా సైనసైటీస్ వ్యాధితో బాధపడేవారు కళ్ల రెప్పల వాపు, కనుగుడ్లు, పక్కకు జరిగినట్టు ఉండడం, కంటి చూపు దెబ్బతినడం, వాసనలు తెలియకపోవడం, తరచుగా జ్వరం రావడం, ఎదుగుదుల లోపాలు రావచ్చు.
హోమియో పతి విధానంలో ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమూలంగా కానిస్ట్యూషనల్ చికిత్స ద్వారా పూర్తిగా తగ్గించడం వీలవుతుంది.

నివారణ సాధ్యమే
-నోరు శుభ్రం చేసుకునే సమయంలో గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి.
-అలర్జీ కలిగించే దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి.
-పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
-ఎక్కువ సమయం పాటు నీటిలో ఉండకూడదు.
-చల్లని గాలిలో బయటికి వెళ్లాల్సి వస్తే చెవులు కప్పిఉంచుకోవాలి.
-వేడి నీటి ఆవిరి పట్టడం వంటి జాగ్రత్తలతో లక్షణాలను నియంత్రించవచ్చు

హోమియోచికిత్స
హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంచి మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కాలిబైక్, కాలిసల్ఫ్, హైపర్ సల్ఫ్, మెర్క్ సాల్, సాంగ్‌న్యూరియా, లెమ్‌నా, స్పైజిలియా వంటి మందులు సమర్ధంగా పనిచేస్తాయి.
murali

1600
Tags

More News

VIRAL NEWS