సేంద్రియ పద్ధతిలో టెర్రస్ గార్డెన్


Sun,August 26, 2018 11:05 PM

ఆమెకు ఆకుకూరలంటే చాలా ఇష్టం. వారంలో మూడుసార్లు ఏదో ఒక ఆకుకూర వండాల్సిందే. అయితే, మార్కెట్‌లో దొరికే ఆకుకూరలు పురుగుమందుల వాసన వస్తుండడంతో ఆలోచనలో పడింది. తానే సొంతంగా సేంద్రియ పద్ధతిలో పండించాలని టెర్రస్ గార్డెన్ వైపు అడుగులు వేసింది.
terrace-garden
బెంగళూర్‌కు చెందిన యాన్ విన్య థామస్ వైమానిక పరిశ్రమలో 17 సంవత్సరాలు పనిచేసింది. వివాహిత అయిన విన్యకు ఆకుకూరలంటే మక్కువ. ప్రస్తుతం మార్కెట్‌లో పురుగుమందులు, రసాయనాలతో పండించిన ఆకుకూరలే దొరుకుతుండడంతో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నది. దీంతో ఎలాగైనా సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు పండించి కుటుంబానికి అందించాలని ఆలోచించింది. అలా ఇంటి టెర్రస్‌ను గార్డెన్‌గా మలిచింది. ఒకవైపు పిల్లలు, ఇంటి పనులను చూసుకుంటూనే ఇంటిపై వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. సేంద్రియ పద్ధతిలో ఎలా పండించాలో తెలుసుకునేందుకు య్యూటూబ్‌లో వెతికేది. ఆ విషయాలను పూర్తిగా అవగాహన చేసుకొని సహజసిద్ధంగా ఇంటికి సరిపడా ఆకుకూరలు పండించింది. తన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వడంతో గార్డెన్‌ను మరింతగా విస్తరించింది. ఇలా రకరకాల ఆకుకూరలను పండించడం మొదలు పెట్టింది. వాటికి ఎలాంటి తెగులు వచ్చినా, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు, య్యూటూబ్ ద్వారా తెలుసుకొని వాటిని నివారించేది. ఈ క్రమంలో రైతులు పడుతున్న శ్రమను, వారి గొప్పతనాన్ని గుర్తించింది. 30 రోజులకు ఒకసారి వాటి పెరుగుదలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేది. ఆ పోస్టులు చూసిన వారు వాటిని తమకు కావాలంటూ రీపోస్టులు పెట్టడంతో.. అలా ఆకుకూరలు అమ్మడం మొదలు పెట్టింది. వాటిని తీసుకోవడానికి వచ్చినవారు విన్యథామస్ చేస్తున్న కొత్త వ్యవసాయానికి ఫిదా అయ్యేవారు. దీనిని నేను ఆదాయాన్ని ఆశించి చేపట్టలేదు. ఇంటి అవసరాల కోసమే అనుకున్నా. క్రమంగా అమ్మడం మొదలు పెట్టాను. ఇది నాకు తృప్తినిస్తున్నది అని చెప్పుకొచ్చింది విన్య థామస్.

641
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles