సెంటు వాడుతున్నారా?


Mon,January 7, 2019 11:10 PM

ఒక్క నిమిషం ఆగండి. సెంట్ లేదా పెర్ఫ్యూమ్ మీకు గుప్పుమనే సుగంధాన్ని ఇస్తుండొచ్చు. కానీ అంతకుమించి అనారోగ్యాన్ని కలుగజేస్తుందనే విషయం తెలుసుకోండి. సెంట్, పెర్ఫ్యూమ్స్‌లో రసాయనిక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Perfume
రసాయనిక సమ్మేళనాలతో తయారైన సెంట్, పెర్ఫ్యూమ్‌లు నేరుగా చర్మాన్ని తాకడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. కొందరికి గాయాల మాదిరిగా అవుతుంటాయి. మరికొందరిలో ఇన్‌ఫ్లమేషన్ వంటి చర్మ రుగ్మతలు వస్తాయి. డిప్రెషన్‌కు కూడా దారితీసే ప్రమాదం ఉంది. ప్రాథమికంగా విపరీతమైన తుమ్ములు వస్తుంటాయి. కొన్నిసార్లు కండ్ల వెంట నీరు కారుతూ అలర్జీగా అనిపిస్తుంటుంది. ఇలాంటి సమస్యలు ప్రతి 10 మందిలో ఒకరికి ఉంటున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. సెంట్ల వల్లనే 55% అమెరికన్లు అలర్జీలతో బాధపడుతున్నారట. టెక్సాస్ మెడిసిన్ ప్రాక్టీస్ ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పర్ఫ్యూమ్స్ వాడుతున్న వారిలో 2% మంది విష ప్రభావాలను ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు. వీటివల్ల డెర్మటైటిస్, తామర వంటి ప్రమాదకర చర్మ వ్యాధులకు దారితీస్తున్నాయట. లేబుల్స్ లేని పర్ఫ్యూమ్‌లను వాడి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని వారు సూచించారు.

281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles