సూక్ష్మకళలో దిట్ట.. ఒరిజిత!


Fri,August 24, 2018 01:13 AM

అరుదైన ఆకృతులతో ఆకట్టుకుంటున్నది యువ కళాకారిణి ఒరిజిత. ఇప్పటి వరకూ రకరకాల లోహాలతో మాత్రమే చిన్న చిన్న ఆకృతులనుతయారు చేసిన వాళ్లనే మనం చూశాం. చెన్నైకి చెందిన ఈ కళాకారిణి ఇంట్లో సామగ్రి దగ్గర నుంచి, రోజూ వాడే వస్తువులను సైతం సూక్ష్మ కళతో అందంగా తీర్చిదిద్దుతున్నది.
Oorjitha-Dogiparthi
పేపర్‌తో వివిధ వస్తువులు, రకరకాల ఆకృతులను తయారు చేసే విధానాన్ని ఒరిగామి కళ అంటారు. ఇది జపాన్‌కు చెందిన కళ. చెన్నైకి చెందిన 22 ఏళ్ల ఒరిజిత డోగిపర్తి నాలుగేళ్ల వయసు నుంచే ఒరిగామి కళపై ఆసక్తి పెంచుకున్నది. ఆమె వంట పాత్రలనే కాకుండా, వంటకాల రూపంలోనూ కళాకృతులను తయారు చేస్తున్నది. తాను ఈ పనిని ప్రారంభించినప్పుడు పేపర్‌తోనే ఏం చేస్తావ్ అంటూ హేళన చేసినట్లు ఒరిజిత చెబుతున్నది. అయితే, అప్పుడు ఆమెను చులకనగా చూసినవారే ఇప్పుడు తాను రూపొందించిన కళాకృతులకు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా, వాటిని కొనేందుకు చాలామంది ఆసకి చూపుతున్నారు. తల్లి ద్వారా పేపర్ ఆర్ట్‌పై ఆసక్తి పెంచుకున్నట్లు ఒరిజిత చెబుతున్నది. స్థానిక లయోలా కాలేజీలో ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో పీజీ చేసింది. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే, పేపర్ వర్క్ చేసేది. ఈ కళాఖండాలను జనంలోకి మరింతగా తీసుకెళ్లేందుకు.. చెన్నై వాసులకు ఇష్టమైన ఇడ్లీ, సాంబార్ రూపంలో తయారు చేయడం ప్రారంభించింది. అలా నిత్యం ఉపయోగించుకునే వస్తువుల ఆకారంలో వాటిని రూపొందించి విజయం సాధించింది. తాను తయారు చేసిన కళాకృతులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. అవి అన్ని వర్గాల వారిని ఆకర్షించడంతో స్నేహితులు, బంధువులు ప్రోత్సహించారు. ఇలా, ఐస్‌క్రీమ్, పానీపూరీ, వీణ, ల్యాప్‌టాప్, టెలిస్కోప్, కుక్కర్, గ్లోబ్, స్మార్ట్‌ఫోన్, పర్సు, చేప, షోకేస్ ప్లాంట్లను కాగితంతో రూపొందించింది. వీటికి ఆన్‌లైన్‌లో మరింత ఆదరణ పెరగడంతో ఆమె ఆర్డర్‌పై వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా కాగితపు కళాకృతులను తయారు చేసి అమ్ముతున్నది. ఈ కళాకృతులు చెన్నైలో హాట్ టాపిక్‌గా మారాయి.
Oougami1

399
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles