సున్నిత దంతాలా?


Tue,May 7, 2019 01:03 AM

ఉష్ణోగ్రతలు ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఏం కోరుకుంటుంది? కాస్త చల్లదనం. తినేవి.. తాగేవి కూడా చల్లగా ఉంటే ఉపశమనం అనిపిస్తుంది. కానీ ఏ చల్లనిది ముట్టుకోవాలన్నా మనకు మన సెన్సిటివ్ దంతాలే గుర్తుకొస్తాయి. ఇందుకోసం నాలుగు పరిష్కార మార్గాలు పాటించాలి.
Sensitive-Teeth
1. ఆయిల్ పుల్లింగ్: ఇదొక ఆయుర్వేదిక్ టెక్నిక్. నువ్వుల నూనె లేదా కొబ్బరినూనెను ప్రతీరోజు ఉదయాన్నే నోట్లో వేసుకొని ఆయిల్‌పుల్లింగ్ చేస్తే దంత సమస్యలు పోతాయి.
2. జామ ఆకులు: దంత సున్నితత్వం కలవారు ప్రతిరోజూ 3-4 జామ ఆకులను నమలితే సున్నితత్వం తగ్గిపోతుంది. దంతాల నొప్పి కూడాపోతుంది. శోధ నిరోధకత.. యాంటీ మైక్రోబయోల్ లక్షణాలు జామ ఆకులో ఉంటాయి.
3. పసుపు: దీనిలో విటమిన్ బీ6, మాంగనీస్, విటమిన్ సీ, కాపర్ పుష్కలంగా ఉంటాయి. రోజు క్రమం తప్పకుండా చిటికెడు పసుపు, 1-2 లవంగాలు తినాలి. ఇది దంతాల్లోని బాక్టీరియాలను తగ్గిస్తుంది.
4. ఉప్పునీరు: సగం టీ స్పూన్ ఉప్పు, ఒక గ్లాసెడు గోరువెచ్చనీళ్లు బాగాకలిపి నోట్లో వేసుకొని పుక్కిలిస్తే క్రిములు నశిస్తాయి. దంతాలు దృఢంగా తయారవుతాయి.

174
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles