సుచరిత


Tue,September 4, 2018 02:55 AM

Sucharitha
మన కంటికి కనిపించని సూక్ష్మక్రిమిని మొట్టమొదట శాస్త్రవేత్తలు సూక్ష్మదర్శిని సహాయంతో సుమారు మూడున్నర శతాబ్దాల క్రితం దర్శించారు. తొలిజీవశాస్త్రవేత్తగా ప్రసిద్ధుడైన నెదర్లాండ్‌కు చెందిన ఆంటోన్ వ్యాన్ ల్యూవెన్‌హోక్ (Anton van Leeuwenhoek) అనే డచ్ భాషీయుడు క్రీ.శ. 1674లో ఈ ఘనతను సాధించాడు. ఆ మరుసటి ఏడాదే (1675) జూన్ 16న ఆయన వర్షం నీటిలో సూక్ష్మక్రిములు, శిలీంద్రాల (ఫంగీ)తోసహా అనేక ఏకకణ సూక్ష్మజీవులను కనుగొన్నాడు. నీటిని వేడి చేయడంతో బ్యాక్టీరియాను చంపేయవచ్చునని లూయిస్ పాశ్చర్ (Louis Pasteur) తొలిసారిగా గుర్తించాడు. అలాగే, పలు రోగాలకు సూక్ష్మజీవులే కారణమన్న సంగతిని జర్మనీకి చెందిన డాక్టర్ రాబర్ట్ కోచ్ (Robert Koch) 1876లో కనిపెట్టారు. ఇక, బ్యాక్టీరియమ్ అన్న పేరును 1828లో పరిచయం చేసింది అదే దేశంలోని గాటిఫ్రైడ్ ఎహ్రెన్‌బర్గ్ (Gottfried Ehrenberg). ఇలా మనకు తెలియని సూక్ష్మజీవలోకంపై పరిశోధనలు వెల్లువెత్తాయి.

79
Tags

More News

VIRAL NEWS

Featured Articles