సుచరిత


Mon,August 27, 2018 11:14 PM

Sucharitha
సర్వత్రా విస్తరించిన కంప్యూటర్ చరిత్ర 19వ శతాబ్ది ఆరంభంలోనే మొదలైంది. మూడు తరాలుగా నిపుణులు దీనిని విభజిస్తుండగా ప్రతి దానికీ నిర్దిష్ట సమయం, కొత్త తరం అభివృద్ధి చెందేదాక కొనసాగింది. 1937-46 మధ్య కాలంలో తొలి తరం, 1947-62 నడుమ రెండో తరం, 1963 తర్వాతి నుంచి మూడో తరం కంప్యూటర్లు వచ్చాయి. మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్‌ను 1937లో డా॥ జాన్ వి. అటనాసోఫ్, క్లిఫోర్డ్ బెర్రీలు రూపొందించారు. 1943లో ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు కొలోసస్ (Colossus) అన్న పేరు పెట్టారు. ఇక, తొలి కమర్షియల్ కంప్యూటర్‌గా యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ (Universal Automatic Computer-UNIVAC 1) 1951లో అందుబాటులోకి రాగా, ఒకే సమయంలో వివిధ రకాల ప్రోగాములను వినియోగించుకోగల అద్భుత నైపుణ్యంతో కూడిన ఆధునాతన కంప్యూటర్లు 1963 తర్వాత ఒక్కటొక్కటిగా అభివృద్ధి చెందాయి.

131
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles