సుచరిత


Mon,August 20, 2018 11:01 PM

Sucharitha
ప్రాచీనకాలంలో సుమారు క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికే ఎలివేటర్లు (లిఫ్టులు) వాడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది. అప్పుడు జంతువులు, మనుషులు, నీటిచక్రాలు సమకూర్చే శక్తితో అవి పనిచేసేవి. క్రీ.శ.1743లో మనిషి స్వీయశక్తితో పనిచేసే వ్యక్తిగత ఎలివేటర్‌ను ఫ్రాన్స్ 15వ రాజు కింగ్ లూయిస్ తన భార్య కోసం తయారుచేయించాడు. 19వ శతాబ్దంలో లిఫ్టుల సాంకేతికత మరింతగా అభివృద్ధి చెందింది. పారిశ్రామిక విప్లవంలో భాగంగా కార్మికులు భారీ నిర్మాణ వస్తువులను పైకి ఎత్తడానికి, గనులలో పనులు నిర్వహించడానికి స్టీమ్‌తో పనిచేసే ఎలివేటర్లను వాడారు. 1823లోనే సురక్షితమైన ఎలివేటర్లను తయారుచేసే కంపెనీ ప్రారంభమైంది. ఇక, తొలి విద్యుత్ ఎలివేటర్ 1880 నాటికే వచ్చేసింది.

115
Tags

More News

VIRAL NEWS