సీ విటమిన్ లోపిస్తే?


Tue,February 19, 2019 01:36 AM

C-Vitamine
సీ విటమిన్ ఆరోగ్యానికి చాలా ఉపయోగరకమైందే అయినా చాలామంది దానిని తీసుకోరు. కానీ అలా చేయవద్దు అంటున్నారు నిపుణులు. సీ విటమిన్ లోపం వల్ల మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉందట.


సాధారణంగా మెదడుకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల పక్షవాతం వస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మెదడు కణజాలంలో రక్తనాళికలు చిట్లి రక్తం గడ్డలు కట్టడంవల్లనూ పక్షవాతం వస్తుంది. అలాంటి సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. శరీరంలో విటమిన్-సి శాతం తక్కువయితే ఈ రకమైన ప్రమాదం రావచ్చని పరిశోధకులు చెప్తున్నారు. సి-విటమిన్ లోపాన్ని తేలికగా తీసుకోకూడదు. విటమిన్ సీ లోపం ఉన్నవాళ్లకు బీపీ కూడా ఉంటే.. వాళ్లకు ఆల్కహాల్ తీసుకోవడం అలవాటుగా ఉంటే అది కచ్చితంగా గుండెపోటుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సీ విటమిన్ అధికంగా ఉండే సంత్రాలు, బొప్పాయి, జామ, స్ట్రాబెర్రీ, ఉసిరి వంటి పండ్లను తప్పనిసరిగా తినాలని వారు అంటున్నారు.

239
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles