సీకేడీ ప్రాణాంతకం


Wed,February 22, 2017 02:34 AM

భారత దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్న వారు 17 శాతం ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. అంటే ప్రతి వంద మందిలో పదిహేడు మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నారని అర్థం. దీనికి సంబంధించిన అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం తెలియజేస్తున్నది.
Kidney-Stones

సీకేడీ అంటే ఏమిటి?


దాన్ని ఎలా నివారించాలి అనే అంశాల గురించి అవగాహన కల్పించాలి. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ప్రాణాంతకంగా పరిణమించే ఈ వ్యాధి గురించి సామాజిక స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. ఒకసారి వ్యాధి నిర్ధారణ జరిగితే అది త్వరగా ముదిరిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం, సీకేడీ ప్రమాదం ఎవరికి ఉండే ఆస్కారం ఉందో తెలియజేయడంలాంటి విషయాలన్నీ అవగాహనా కార్యక్రమాల్లో పొందుపర్చాలి.

క్రానిక్ కిడ్నీ డిసీజ్


సీకేడీ స్క్రీనింగ్‌లో సీరం క్రియాటినిన్/ ఈజీఎఫ్‌ఆర్, మూత్రం ప్రొటీన్‌ను రక్తం, మూత్ర పరీక్షలు చేసి తెలుసుకుంటారు. సీకేడీ వచ్చే ప్రమాదం ఉందని భావించిన వారికి ఈ పరీక్షలు చేస్తారు. ఎలాంటి లక్షణాలు కనిపించని వారిలో కూడా వ్యాధి నిర్ధారణ కావచ్చు. అలాంటి వారిలో వ్యాధి తీవ్రతరం కాకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు.

ఎవరిలో ఎక్కువ?


-డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు
-హై బీపీతో బాధపడుతున్న వారు
-స్థూలకాయంతో బాధపడుతున్న వారు
-రక్తసంబంధీకులలో సీకేడీ సమస్య ఉంటే ఆ కుటుంబంలోని వారికి సీకేడీ వచ్చే ప్రమాదం ఉంటుంది.
-కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు
-నొప్పి నివారణ మందులు, యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడే వారు
-వయసు పైబడిన వారిలో సీకేడీ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ అని చెప్పవచ్చు.

లక్షణాలు


-ఆకలి మందగించడం
-అయోమయం
-బరువు తగ్గిపోవడం
-చర్మం పొడిబారడం, దురద
-కండరాలలో తిమ్మిరి
-పాదాలు, చీల మండల్లో వాపు
-శరీరంలో నీటి నిల్వలు పెరిగిపోవడం
-ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చెయ్యాల్సి రావడం
rajashekar

రక్తహీనత


కిడ్నీల పనితీరు పూర్తిగా మందగించినపుడు రక్తహీనత, రక్తంలో కాల్షియం, ఫాస్పేట్ వంటి లవణాల అసమతుల్యత. సరైన సమయంలో చికిత్స అందకపోతే సీకేడీ ప్రాణాంతకమవుతుంది.
ఈ సమస్య 5వ స్టేజ్‌లో ఉన్నవారికి ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప మరో మార్గం శాశ్వత చికిత్స లేదు. క్రమం తప్పకుండా డయాలసిస్ చెయ్యడం తప్పనిసరి. డయాలసిస్ రెండు రకాలుగా ఉంటుంది. హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ హాస్పిటల్‌లో మాత్రమే చేస్తారు. వారానికి రెండు సార్లు హాస్పిటల్‌కు వచ్చి ఈ చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ ఇంటి దగ్గరే చేయించుకోవచ్చు. నెలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే సరిపోతుంది. డయాలసిస్‌తో పాటు బీపీ, డయాబెటిస్ అదుపులో ఉంచే మందులను కూడా వాడాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే దాత నుంచి కిడ్నీ తీసుకొని అది సీకేడీతో బాధపడుతున్న వ్యక్తికి అమర్చాల్సి ఉంటుంది.

1245
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles