సాల్ట్ హోటల్


Thu,December 13, 2018 11:19 PM

డీలక్స్ హోటల్, స్టార్ హోటల్, ఫైవ్‌స్టార్ హోటల్ ఇలా ఎన్నో రకాల హోటల్స్ చూసే ఉంటారు. కానీ ఇదొక వింత హోటల్. ఇలాంటిది మీరెప్పుడు చూసి ఉండరు. అదేంటో తెలుసా? ఉప్పుహోటల్.
star-hotels
అవును మీరు చదివింది నిజమే. ఈ హోటల్ ఉప్పుతో తయారైంది. ఇందులో 12 పడక గదులున్నాయి. గదుల్లో మంచాలు, కుర్చీలూ ఉన్నాయి. అన్ని హోటల్లో లాగే ఇలాంటి ఫర్నీచర్ కాకుండా మరేముంటుంది అని విసుక్కోకండి! విశేషం ఏంటంటే అవన్నీ ఉప్పుతో చేసినవి కావడం ఇక్కడ విశేషం. ప్రపంచంలో ఉప్పు దిమ్మలతో కట్టిన హోటల్ ఇదొక్కటే! ఈ హోటల్లోకి ఎవరైనా వెళ్లవచ్చు కానీ, ఒకటే షరతు! అదేంటో తెలుసా? ఇచ్చట గోడలు నాకరాదు! అని ముందే చెబుతారు. బొలివియా దేశంలోని ఉయుని పట్టణం దగ్గర ఈ లవణ భవనం ఉంది. దీని పేరు పాలాసియో డి సాల్. అంటే స్పానిష్ భాషలో ఉప్పు ప్యాలెస్ అని అర్థం. దీని నిర్మాణానికి 15 అంగుళాల ఉప్పు పలకలను ఏకంగా 10 లక్షలు తయారు చేసి వాటితో కట్టారు. ఇందులో అలంకరణ కోసం పెట్టిన శిల్పాలు, కళాఖండాలు కూడా ఉప్పుతో మలిచినవే. ఇందులోని ఈతకొలనులో ఉప్పు నీరే ఉంటుంది. హోటల్ బయట గోల్ఫ్ కోర్స్ కూడా ఉప్పుమయమే. దీన్ని నిజానికి 1993లోనే కట్టినా రెండేళ్లలోనే మూసివేశారు. తిరిగి 2007లో సకల సౌకర్యాలతో నిర్మించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు గోడల్ని నాకకుండా సిబ్బంది పరిశీలిస్తూ ఉంటారు.
hotel_od_soli

817
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles