సర్జరీ లేకుండా ముడతలు మాయం!


Fri,January 26, 2018 10:49 PM

నా వయసు 43 సంవత్సరాలు. నాకు ముఖంపై ముక్కు, కళ్ల పక్కన, నుదుటి మీద చాలా ముడతలున్నాయి. వీటివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు నా వయసువారిని చూస్తే చిన్నతనంగా అనిపిస్తున్నది. 3 నెలల కింద డాక్టర్‌ను కలిస్తే, ఫేస్‌లిఫ్ట్ సర్జరీ మాత్రమే దీనికి పరిష్కారం అని చెప్పారు. సర్జరీ లేకుండా ఈ ముడుతలు తగ్గే మార్గం ఏదైనా ఉందా?
- కవిత, వరంగల్

Sarjary
ముఖంపై ముడతలు రావడానికి అనేక కారణాలున్నాయి. కాస్మోటిక్ పదార్థాలను ఎక్కువగా ఉపయోగించడం ఇందుకు ప్రధాన కారణం. దీంతోపాటుగా వయసు వల్ల వచ్చే మార్పులు, కాలుష్యం, నిద్ర లోపించడం, పోషకాహారలోపం కూడా దోహదం చేస్తాయి. అయితే కారణం ఏదైనా ముడుతలకు ఫేస్‌లిఫ్ట్ సర్జరీనే చివరి ఆప్షన్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం కాస్మోటిక్ సర్జరీలో అధునాతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిద్వారా సర్జరీ లేకుండానే ముఖంపై ఏర్పడిన ముడుతలను తొలిగించుకోవచ్చు. మీ సమస్యను బొటాక్స్ ఇంజెక్షన్లు/ఫిల్టర్లు/త్రెడ్స్ లాంటి పద్ధతుల ద్వారా పరిష్కరించవచ్చు. మీరు మీకు దగ్గరలోని సీనియర్ కాస్మోటిక్ సర్జన్‌ను సంప్రదించండి. పైన సూచించిన చికిత్సల్లో మీకు ఏది సరిపోతుందో ఎంపిక చేసి ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఈ చికిత్సల కోసం ఎటువంటి మెడికల్ పరీక్షల అవసరం ఉండదు. చికిత్స తీసుకున్న తరువాత రెండు గంటల్లోపే దవాఖాన నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని బ్యూటీపార్లర్లలో బొటాక్స్ ఇంజెక్షన్లను ఇస్తున్నారు. కాని ఈ పద్ధతులు బ్యూటీపార్లర్లలో చేయించుకునేవి కావు. కేవలం అనుభవం ఉన్న కాస్మోటిక్, ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయగలరు.

డాక్టర్ భవానీ ప్రసాద్
సీనియర్ కాస్మోటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్, సన్‌షైన్ హాస్పిటల్స్
సికింద్రాబాద్

526
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles