సరైన కంటి చూపుకోసం..


Mon,September 10, 2018 01:29 AM

మీ కళ్ళు ప్రపంచాన్ని చూడడానికి కిటికీలాంటివి. మీరు ప్రతిరోజు పనులు చేసుకోవడానికి కంటి చూపు చాలా ప్రధానమైంది. మన ముఖానికి అందాన్నిచ్చేవి కళ్ళు. అటువంటి కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి కళ్ళు ఎక్కువగా ఎండలో ైస్ట్రెన్ అవకుండా చూసుకోవాలి. ఇంకా కళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల కళ్ళలో ఏర్పడిన దుమ్మును తొలగించుకోవచ్చు. అలాగే మరికొన్ని చిట్కాలు పాటించాలి.
eye
-బాదం మిల్క్ వారానికి రెండుసార్లు తీసుకోవడం వల్ల కంటి సమస్యలు ఉండవు. బాదంలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యమే కాదు. కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలలో క్యారెట్ కూడా ఉపయోగపడుతుంది. సోంపును రాత్రి ఒక గ్లాస్ నీళ్లలో నానబెట్టి మరుసటి ఉదయం ఆ నీటిని తాగాలి. పరగడుపుతో తీసుకోవడం వల్ల ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.
-ఉసిరికాయతో చేసిన మిల్క్‌ను గోరువెచ్చగా తీసుకోవడం కళ్ళ ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని ఖాళీ కడుపుతో తీసుకోవాలి అంతేకాదు, ఇది శరీర బరువును కూడా తగ్గిస్తుంది.
-చేపలు, బాదం, గుడ్డు, బొప్పాయి, క్యారెట్, సన్ ఫ్లవర్ సీడ్స్ లాంటి విటమిన్ E ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వలన కంటిచూపు దీర్ఘకాలం పాటు ఉంటుంది. ఈ ఆహార అలవాట్లను మీరు రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాల్సిందే.
-విటమిన్ A ఫుడ్స్ జామ, ఆరెంజ్, పైన్ ఆపిల్, రెడ్, గ్రీన్ చిల్లీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

696
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles