సరిహద్దులు చెరిపిన స్నేహం


Sat,August 25, 2018 01:24 AM

ఒకామె చిత్రకారిణి. మరొకామె మానవహక్కుల కార్యకర్త. ఒకరు చిత్రకళద్వారా వివక్షతో కూడిన సమాజంలో చైతన్యం తీసుకొస్తుంటే.. మరొకరు తన వాక్చాతుర్యంతో వివక్షపై పోరాడుతున్నారు. ఇంటర్నెట్‌లో కనిపించిన ఓ పెయింటింగ్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మంచి స్నేహితులుగా మారి భారత్-పాకిస్థాన్ సరిహద్దులను చెరిపారు.
Nida-and-Shilo
బెంగళూర్‌కు చెందిన షిలో శివ్ సులేమాన్ చిత్రకారిణి. దేశంలో పెరిగిపోతున్న లింగవివక్షను ఎండగడుతూ తన చిత్రాల ద్వారా చైతన్యం కలిగిస్తున్నది. విదేశాలు తిరుగుతూ పలు పోటీల్లో పాల్గొంటూ చిత్రకళ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తుంటుంది. ఈ క్రమంలో శ్రీలంక వెళ్లిన షిలోకు పాకిస్థాన్‌కు చెందిన నిదా ముస్తాక్‌తో పరిచయం ఏర్పడింది. ఆమె పాకిస్థాన్‌లో లింగవివక్షపై పోరాడే మానవహక్కుల కార్యకర్త. ఇద్దరి లక్ష్యాలు, అభిప్రాయాలు ఒక్కటే కావడంతో దేశాలు, భాషలు వేరైనా సులువుగా కలిశారు. వీరి స్నేహం దృఢపడడంతో నిదా ముస్తాక్ కోసం లాహోర్ వెళ్లింది షిలో. ఆ తర్వాత వీరి నేతృత్వంలో ఫియర్‌లెస్ కలెక్షన్స్‌ను స్థాపించారు. దాని ద్వారా విదేశాల్లో కూడా లింగవివక్షపై చైతన్యం కలిగిస్తున్నారు. ప్రతి పండగకూ, శుభకార్యాలకు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. దుస్తులు, నగలు, వస్తువులను ఒకరికొకరు పంచుకుంటూ మంచి స్నేహితులుగా మారారు. మనసు మంచిగా ఉంటే ప్రపంచమే దాసోహం అవుతుందనీ, స్నేహానికి హద్దులు లేవనీ నిరూపించారు ఈ ద్వయం.

210
Tags

More News

VIRAL NEWS