సయాటికా విడుపు-11


Tue,August 27, 2013 12:17 PM

వెన్నెముక, పొత్తికడుపు, నడుముబాగాన్ని శక్తివంతం చేసి సయాటికాను దరిచేరనీయకుండా చేసే కంధారాసనం ఈ వారం...
కంధారాసనం
నేలమీద వెల్లకిలా పడుకోవాలి. కాళ్లను మోకాలి వద్ద మడిచి పాదాలను తొడల దగ్గరికి వచ్చేట్టుగా చూసుకోవాలి. తరువాత కుడికాలి మడమను కుడిచేతితో, ఎడమకాలి మడమను ఎడమచేతితో పట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ వెన్నెముక, నడుము భాగాలను వీలయినంత పైకి ఎత్తే ప్రయత్నం చేయాలి. తల, భుజాలు, పాదాలు నేలపైనుంచి కదలనివ్వకూడదు. ఈ స్థితిలో 15 నుంచి 20 సెకన్లపాటు లేదా మీకు వీలయినంతసేపు ఉంచాలి. తరువాత నెమ్మదిగా గాలి వదులుతూ మొదట వెన్నెముక, నడుము భాగాన్ని నేలపైకి తీసుకురావాలి. ఇప్పుడు మడమలను వదిలేసి పాదాలను చాచి శవాసనంలోకి రావాలి. ఇలా రెండు మూడుసార్లు చేయొచ్చు.
Yoga
ఉపయోగాలు :
- ఈ ఆసనంలో వెన్నెముకను బాగా స్ట్రెచ్ చేయడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగి కొత్త శక్తినిస్తుంది.
-గర్భాశయం, రుతు సంబంధమైన వ్యాధులతో బాధపడే మహిళలు ఈ ఆసనం చేయడం మంచిది.
-ఆస్తమా, శ్వాస కోశ సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది.
- థైరాయిడ్ గ్రంథి శక్తివంతమవుతుంది.
- కాలికండరాలు మంచి ఆకారాన్ని సంతరించుకుంటాయి.
- సర్వాంగాసనం చేసిన వెంటనే దీనిని చేయడం వల్ల సర్వాంగాసన ప్రయోజనం ఎక్కువ చేకూరుతుంది.
జాగ్రత్తలు :
-హెర్నియా, మెడనొప్పి ఉన్నవాళ్లు ఈ ఆసనం చేయకపోవడం మంచిది.
గమనిక
- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

4391
Tags

More News

VIRAL NEWS