సంతోషం కోసం కుక్కను పెంచుకోండి!


Wed,September 5, 2018 12:47 AM

కొంతమంది కాపలా కోసం కుక్కను పెంచుకుంటారు. మరికొంతమంది అభిరుచి కోసం పెంచుకుంటారు. సంతోషం కోసం కుక్కను పెంచుకోవడమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇలా చేయమని నిపుణులు సూచిస్తున్నారు. ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చంటున్నారు.
Owing-Dogs
కుక్కను పెంచుకోవడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని స్వీడిష్ శాస్త్రవేత్తలు అంటున్నారు. కుక్కల పెంపకం-ప్రయోజనాలు అనే అంశంపై వారు అధ్యయనం చేశారు. దీనిలో భాగంగా 40-80 ఏళ్ల వయసున్న దాదాపు 3.4 మిలియన్ మందిని పరిశీలించారు. ఒత్తిడి లేని ప్రశాంత మనస్తత్వం.. దేన్నయినా తట్టుకోగల సామర్థ్యం కుక్కలను పెంచేవారిలో ఎక్కువగా ఉంటుందట. ఆరోగ్యపరంగానూ ప్రయోజనాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు 23%, మరణాలు 20% తగ్గినట్లు పేర్కొన్నారు. కుక్కలతో కలిసి వాకింగ్ చేస్తే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుందట. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అని సూచిస్తున్నారు. స్వీడిష్ జర్నల్ ద గార్డియన్‌లో ఈ విషయంపై విశ్లేషించారని వారు తెలిపారు.

294
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles