శ్రేష్టమైన పాటల పూదోట..


Wed,September 14, 2016 01:39 AM

tharunపెళ్లిచూపులు దర్శకుడు భాస్కర్ సన్నివేశం ఇలా చెప్పారు- హీరోయిన్ స్ట్రాంగ్ అమ్మాయి. మెల్లమెల్లగా ఒక అబ్బాయికి అట్రాక్ట్ అవుతుంది. అది కూడా తెలియకుండా, తన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. రొమాంటిక్ సాంగ్‌లా ఉండాలి.ప్రేమంటే ఊహాలోకం.. ఆ ఊహానే ఊహించుకుంటూ చినుకు తాకే జడిలో.. పాట రాసేసింది శ్రేష్ట. ఈ పాటే కాదు.. ఇందులో మరో పాట.. ఒక బీజీయం కూడా రాసింది. పాటలు వింటే ఈ అమ్మాయికి.. సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఎంత అవగాహన ఉందో అనిపిస్తుంది. కానీ శ్రేష్టకి ఆ రెండింటిపై పట్టు లేదు. కేవలం ఆ ట్యూన్ విని పదిహేను రోజుల్లో పాటలు రాసేసింది. అయితే ఒకానొకప్పుడు గంటలో పాట రాసేసిన అమ్మాయికి.. ఈ పాటలు రాయడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది.

ఆమెను మాటలతో, చేతలతో బాధపెట్టడం ప్రారంభించారు. పేరు తెలియకముందే ఆఫర్లు బాగా వచ్చాయి. పాపులరయ్యాక తన పేరే లేకుండా చేయాలనుకున్నవాళ్లున్నారు. సినిమా ఛాన్స్ ఇస్తామంటూ పిలిచి ఇవ్వకపోవడం, ఇస్తే మాకేంటనే తినేసే చూపులనూ భరించలేకపోయింది.

బస్టాండ్‌లో బస..


మధ్యలో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాక చాలా బాధలు పడ్డాను. ఛాన్స్ ఇస్తామంటూ పిలిపించేవారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేదాన్ని. అంతకుముందు రూమ్ ఉండేది. ఖాళీ చేశాక ఛాన్స్ కోసం వెళ్లి లేటయితే.. ఎక్కడ ఉండాలో అర్థం కాక బస్టాండ్‌లో పడుకునేదాన్ని. నేను ఒక్కగానొక్క కూతుర్ని. దాంతో అమ్మవాళ్లు చాలా భయపడ్డారు, బాధపడ్డారు నావల్ల. కానీ ఇప్పుడు పెళ్లిచూపులు సక్సెస్ నాకు మంచి బూస్ట్ ఇవ్వడమే కాక, మరికొన్ని మంచి ప్రాజెక్టులు వచ్చేలా చేసింది. ఈ అవకాశం రావడానికి ముఖ్య కారకుడు.. అనిష్ కురువెళ్ల. కో అంటే కోటి డైరెక్టర్. పెళ్లిచూపులు సినిమాలో హీరోకి పిల్లనిచ్చే తండ్రి క్యారెక్టర్. ఆయన వల్లే మళ్లీ నా సినిమా ఎంట్రీ జరిగింది. మరి చూడాలి మళ్లీ నా ఈ ప్రస్థానం ఎన్ని రోజులు కొనసాగుతుందో అంటోంది శ్రేష్ట.

ఉస్మానియా క్యాంపస్‌లో ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతుండగా.. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తోంది. ఆ సమయంలో చదువుకి కామా పడింది. ఖాళీగా ఉండకుండా.. చెన్నైలో సీఏ చేద్దామని వెళ్లింది శ్రేష్ట. ఆమె రూమ్ దగ్గరలో హీరో భానుచందర్ ఇల్లు ఉండేది. ఆయనకు తన కవితలను చూపించింది. పైగా తనకు పాటలు రాసే ఆలోచన కూడా ఉందని చెప్పింది. ఆయన కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు, కాబట్టి కొన్ని ట్యూన్‌లు ఇచ్చి రాయించాడు. పాటల్లో లోపాలు, తప్పులు ఉంటే సరిదిద్దేవాడు. అయితే తనకంత సంగీత పరిజ్ఞానం లేదని ఎవరి దగ్గరైనా శిష్యరికం చేస్తే బాగుంటుందని వెన్నెలకంటిని పరిచయం చేశారు. ఆయన శ్రేష్ట పాటలు చూసి నువ్వు ఎవ్వరి దగ్గర శిష్యరికం చేయాల్సిన అవసరం లేదు అని దీవించారు.

సింగిల్ కార్డ్..


2012లో ఒక సినిమా పోస్టర్ అందరినీ ఆకర్షించింది. స్కార్ఫ్‌లతో కనిపించే ముగ్గురు అమ్మాయిల కథ.. అదే ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. ఆ సినిమా దర్శకుడు సునీల్ కుమార్‌రెడ్డి. ఫ్రెండ్స్ వల్ల సునీల్‌తో పరిచయం ఏర్పడింది శ్రేష్టకి. ఆయన ఆ సినిమాకు ఒక పాట రాసుకురమ్మని చెప్పారు. శ్రేష్ట రాసిన పాట నచ్చి.. సినిమాలో అన్ని పాటలు రాసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా శ్రేష మొదటి సినిమాకే సింగిల్ కార్డ్ పొందింది.

సినిమా కష్టాలు..


శ్రేష్టకి ఇండస్ట్రీ కొత్త. మొదటి సినిమా తర్వాత వెంటవెంటనే ఆఫర్లు రాలేదు. పైగా తనకు ఎల్‌ఎల్‌బీ ఒకటుంది. అటు చదువు, ప్రాక్టీస్ మీద శ్రద్ధ పెట్టింది. అప్పుడే కో అంటే కోటి, జబర్దస్త్, కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమా ఆఫర్లు వరుసగా వచ్చాయి. అన్నిట్లో ఒకటి, రెండు పాటలు రాసింది. అప్పుడే.. రామానాయుడి గారి చేతుల మీదుగా సినిమా మహిళా అవార్డుల్లో బెస్ట్ లిరిసిస్ట్ వన్ అండ్ ఓన్లీ ఉమెన్ అవార్డు కూడా పొందింది. ఇక ఇండస్ట్రీలో సెటిలయినట్టే అనుకున్న తరుణంలో తన మీద బురదజల్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక అమ్మాయి ఈ ఇండస్ట్రీలో ఎలా రాణిస్తుందని అనుకునేవాళ్లు ఎక్కువయ్యారు. ఆమెను మాటలతో, చేతలతో బాధపెట్టడం ప్రారంభించారు. పేరు తెలియకముందే ఆఫర్లు బాగా వచ్చాయి. పాపులరయ్యాక తన పేరే లేకుండా చేయాలనుకున్నవాళ్లున్నారు. సినిమా ఛాన్స్ ఇస్తామంటూ పిలిచి ఇవ్వకపోవడం, ఇస్తే మాకేంటనే తినేసే చూపులనూ భరించలేకపోయింది. అలా ఇండస్ట్రీకి దాదాపు మూడు సంవత్సరాలు దూరమైంది.

అసలు ప్రస్థానం..


శ్రేష్ట సొంతూరు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. తల్లిదండ్రులది లవ్‌మ్యారేజ్. తండ్రి క్రిస్టియన్, తల్లి బ్రాహ్మణ కుటుంబం. వారి పెళ్లి కారణంగా.. కుటుంబాన్ని వెలివేసినంత పనిచేశారు ఆ ఊరి జనాలు, వారి బంధువులు. శ్రేష్ట పుట్టాక సొంత కుటుంబాల్లో మార్పు వచ్చినా.. ఊరి ప్రజల్లో అంతగా మార్పు రాలేదు. అందుకే చిన్నప్పటి నుంచే అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కుంది. తాత కారణంగా.. శ్రీశ్రీ రచనలు చదివి పెరిగిన అమ్మాయి రెబల్‌గా మారిపోయింది. చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ. అమ్మమ్మ వల్ల భక్తిభావం పెరిగింది. అందుకే చిన్నప్పటి నుంచి భక్తి పాటలు, కవితలు రాసే అలవాటు మొదలైంది. ఒక్కగానొక్క మనమరాలిగా పెరిగిన అమ్మాయి.. డిగ్రీ వరకు మంచిర్యాలలోనే చదివింది. సినిమా కష్టాల నుంచి తేరుకోవడానికి వారి అమ్మమ్మ, అమ్మ సాంగత్యం బాగా పనికొచ్చింది.

పెళ్లిచూపులు.. చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి.. పెద్ద సక్సెస్ సాధించింది.
అందుకే సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా.. ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు..
ఇందులో రెండు పాటలను శ్రేష్ట రాసింది.. ఆమె పాటల ప్రయాణం ఈరోజుది కాదు.. మొదటి సినిమాకే సింగిల్ కార్డ్.. కానీ ఇండస్ట్రీ ఆమెను తొక్కేసింది.. అయినా ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా దూసుకుపోతానంటోందీమె.. టాలీవుడ్‌లో మొదటి పాటల రచయిత్రి కూడా శ్రేష్టనే!

nandhuచినుకు తాకే జడిలో.. చిగురు తొడిగే చెలిమె.. విరిసె హరివిల్లులే.. ఎదుట నిలిచే నిజమే.. కలలు పంచే పేరే.. చిలికే చిరునవ్వులే


Oka-Romantic. ఏంటో మరి.. ఈ అల్లరి.. గుండెల్లో పుట్టే లాహిరి.. వింటే మరి.. నీ సంగతి.. చూపుల్తో దోచావే మది..

maxresబంగారూ కొండ.. సడి సెయ్యకుండా..ఎదలోని వెన్న దోచేనే.. ఏ చోటులాగే.. దోబుచులాడి.. దరిచేరకుండా.. కాంచెనే.. నీవెక్కడున్నా.. కనిపెట్టలేనే కనిపించవేలా.. కృష్ణా..క్రీడలు నీవే.. లీలలునీవే.. మారాలు మాని చేరవా.. ఎదలో ఏదో గుబులే ఆయే.. కృష్ణా.. ఎదురై వచ్చి వేదన కనరా.. కృష్ణా.. ప్రాణం నీవే.. ప్రార్థన వినరా.. కృష్ణా..
సౌమ్య నాగపురి
చిన్న యాదగిరి గౌడ్

2691
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles