శుభ్రంగా ఉంచితే.. కరెంట్ ఆదా!


Fri,November 30, 2018 11:22 PM

వంటగదిలో రోజూవాడే ఎలక్ట్రానిక్ వస్తువులను ఎప్పటికప్పుడు తుడుచుకుంటాం. మరి టీవీ, ఫ్యాన్‌ల సంగతేంటి? వాటిని కూడా శుభ్రపరుచుకోవాలి. లేదంటే ఎక్కువ కరెంటు ఖర్చవుతుంది.

save-current
-సీలింగ్ ఫ్యాన్ భాగాల్లోకి దుమ్ము చేరడం వల్ల దాని వేగం తగ్గుతుంది. గాలికోసం రెగ్యులేటర్‌ని మరో పాయింట్‌కి పెంచుతాం. దీనివల్ల కూడా కరెంటు ఎక్కువ ఖర్చవుతుంది.
-ఫ్యాన్ ఊడదీయకుండా శుభ్రం చేయాలంటే ఎత్తయిన స్టూలు వేసుకొని రెక్కలను తుడవచ్చు. బ్రష్‌తో తుడిచిన తర్వాత బట్టను వేడినీటిలో ముంచి బ్లేడ్లను తుడవాలి. ఆ తరువాత పొడి బట్టతో ఫ్యాన్ తుడువాలి. దీంతో ఫ్యాన్ తళతళలాడుతుంది.
-టీవీల మీద దుమ్ము ఎక్కువగా పడుతుంది. దుమ్ముని తుడువకుంటే స్క్రీన్‌కి అంటుకుపోతుంది. దీనివల్ల పిక్చర్ నాణ్యత తగ్గిపోతుంది. ఈ సమస్యతో కంటి మీద ప్రభావం ఏర్పడుతుంది. కనీసం నెలకి ఒకసారైనా టీవీని శుభ్రపరుచుకోవాలి.
-మిక్సీ, గ్రైండర్‌లు కూడా కొన్ని రోజులకి పాతబడిపోతాయి. వాటిని వాడిన వెంటనే నీరు తగులకుండా శుభ్రపరుచుకుంటూ ఉండాలి. లేదంటే సంవత్సరానికే పాడవుతాయి.

1053
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles