శిరోజాల సమస్యలకు చెక్!


Sat,December 8, 2018 02:27 AM

తల వెంట్రుకలకు కావాల్సిన కొవ్వు పదార్థాలు అందకపోవడం వల్ల జుట్టు అధికంగా ఊడుతుంది. జుట్టు మొత్తం పోయిన తరువాత ప్రయత్నిస్తే ఏం లాభం? ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

haircare
- చింతాకు, ఉసిరిరసం, పుదీనా పేస్ట్, ఆలివ్ నూనె వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత వడగట్టి సేవించాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే జుట్టు సమస్యలను తరిమికొట్టొచ్చు.
- మెంతులను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి ఉదయాన్నే పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. మూడు గంటల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
- నారింజ రసాన్ని రెండు గ్లాసులు తీసిపెట్టుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనం తిన్న తరువాత తీసిపెట్టుకున్న నారింజరసాన్ని తాగాలి. తరువాత తలకు ఎటువంటి నూనె వాడకూడదు. తరుచూ ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
- కరివేపాకు, మెంతులతో చేసిన ఆయిల్‌ని వాడాలి. దీన్ని శిరోజాలకు పట్టించాలి. 2 గంటల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు దృఢంగా ఉండడంతో పాటు తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
- పాలు, పండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీలను ఆహారంగా తీసుకోవాలి. వాటిని ప్రతిరోజూ తినడం వల్ల జుట్టు నల్లగా ఆకర్షణీయంగా ఉంటుంది.

467
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles