శస్త్రచికిత్స అయినా రక్తస్రావం ఎందుకు?


Fri,January 19, 2018 01:34 AM

నా వయసు 55 సంవత్సరాలు. మలద్వారం నుంచి రక్త స్రావం అవుతుంటే డాక్టర్‌ను సంప్రదించాను. పైల్స్ అని సర్జరీ కూడా చేశారు. కానీ రక్త స్రావం మాత్రం ఆగలేదు. నేనేం చేయాలి? నా సమస్యకు సరైన సలహా ఇవ్వగలరు?
రామారావు, వరంగల్

MIDLIFE-CRISIS
మలద్వారం నుంచి రక్తం పడడానికి పైల్స్ ఒక కారణం కావచ్చు. కానీ అలా రక్తస్రావం కావడానికి ఇతర మరేదైనా కూడా కారణం ఉండొచ్చు. కారణాన్ని నిర్ధారించడానికి కొలనోస్కోపీ/సిగ్మాయిడోస్కోపీ అనే పరీక్ష చేయించుకోవడం మంచిది. మీకు రక్తస్రావం ఎందుకు జరుగుతుందో ఆ పరీక్ష ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. కారణం తెలిస్తే సరైన వైద్యం చేయించుకోవచ్చు. ఒక్కోసారి ఇలా రక్తం పడడం పెద్దపేగు క్యాన్సర్‌కు సూచన కూడా కావచ్చు. అలా అని భయపడాల్సిన పనిలేదు. తొలి దశలో కనుగొంటే పూర్తిగా తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు అశ్రద్ధ చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించగలరు.

డాక్టర్ ఎం. ఎ. సలీం
సీనియర్ కన్సల్టెంట్
జనరల్ సర్జన్
సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ
కేర్ హాస్పిటల్
హైదరాబాద్

223
Tags

More News

VIRAL NEWS