శరీర పుష్టికి, మానసిక శక్తికి..


Tue,September 26, 2017 01:47 AM

baby
పిల్లల్లో అనారోగ్యాలు రావడానికి ముఖ్యమైన కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే. దీన్ని పెంపొందించడానికి వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం దివ్యమైన ఔషధాన్ని రూపొందించింది. ఆధునిక జీవన విధానాలను కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఔషధమే స్వర్ణామృత ప్రాశన. ఇది పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తినే కాదు మేధో శక్తిని కూడా పెంచుతుంది.

కారణాలేవైనా...

ఈరోజుల్లో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటున్నది. రోజూ వారికి అందించే ఆహారంలో వచ్చిన మార్పులు, తల్లిపాలు పట్టకపోవడం, నానాటికీ తీవ్రమవుతున్న వాతావరణ కాలుష్యం వంటివన్నీ ఈ పరిస్థితికి కారణం కావచ్చు. అంతేకాదు ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకం వంటివాటి వల్ల కూడా ఇలాంటి స్థితి ఏర్పడుతున్నది. ఫలితం ఆ దగ్గు, జలుబు, జ్వరం వంటివి తరచుగా రావడం, జువైనల్ డయాబెటిస్, ఆటిజం వంటి తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలు, ఆస్తమా, నాడీ సంబంధ సమస్యలు కూడా ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వర్ణామృతప్రాశన పేరుతో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఔషధం ఒక టీకా లాంటిది. కాకపోతే ఇది నోటిలో వేసే చుక్కల మందు. ఈ ఔషధం పిల్లల్లో వచ్చే ఎలాంటి వ్యాధినైనా సరే ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యంత బలమైన రోగ నిరోధక శక్తిని, అంతే బలమైన మానసిక శక్తిని ప్రసాదిస్తుంది.

స్వర్ణామృత ప్రాశన ప్రారంభించడానికి ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేదు. ఇది ఏ వయసు పిల్లలకైనా ఇవ్వవచ్చు. ఈ ఔషధ సేవనం వల్ల మేధోవృద్ధి జరుగడం వల్ల పిల్లల్లో ఉండే మానసిక వ్యాధులెన్నో తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి తోడు కొంత మంది పిల్లల్లో కనిపించే చికాకు, కోపం, అసహనం వంటి వికారాలు తగ్గిపోతాయి. ఎప్పుడూ నీరసంగా కనిపించడం, చురుకుగా లేకపోవడం, విషయాలు త్వరగా గ్రహించలేక పోవడం, పరీక్షల్లో వెనుకబడడం వంటి అన్ని రకాల శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది. మొత్తం శరీర వ్యవస్థనంతా ఏకకాలంలో శక్తివంతంగా మార్చే ఔషధాలు ఒక్క ఆయుర్వేదంలోనే ఉన్నాయి. అలాంటిదే ఈ స్వర్ణామృత ప్రాశన. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, నాడి వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపడంతో పాటే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ramakrishna

ఇలా వాడాలి

పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఈ ఔషధాన్ని వాడవచ్చు. పుష్యమీ నక్షత్రం రోజున ప్రారంభిస్తారు. స్వర్ణామృత ప్రాశనను వాడే విధానం మూడు రకాలు. అందులో పుష్యమీ నక్షత్రం రోజున మేధో ద్రవ్యాలతో కలిపి స్వర్ణామృత ప్రాశన ఇవ్వాలి. నెలకొకసారి చొప్పున 21 నెలల పాటు ఇవ్వడం ఒక విధానం. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి, మాననసిక శక్తి ఈ రెండు పెరుగుతాయి. ఇందుకు భిన్నంగా రోజుకొకసారి చొప్పున వరుసగా నెల రోజుల పాటు పెరిగి అత్యంత జ్ఞాన సంపన్నుడవుతాడు. మరింత భిన్నంగా రోజకొకసారి చొప్పున వరుసగా 6 మాసాల పాటు శృతధార అంటే ఏ విషయాన్ని తెలుసుకున్నా దాన్ని జీవిత కాలమంతా గుర్తుంచుకోగల అపారమైన జ్ఞాపక శక్తి అతడి సొంతమవుతుంది.

716
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles