శరీరాన్ని రీబూట్ చేసుకోండిలా!


Mon,December 24, 2018 10:54 PM

కంప్యూటర్‌ను రీబూట్ చేసినట్లే.. మొబైల్ ఫోన్‌ను రీబూట్ చేసినట్లే మన శరీరాన్ని కూడా రీబూట్ చేసుకోవచ్చు. నెలకోసారి ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావు. బాడీ కూడా రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది. క్రిస్మస్.. న్యూ ఇయర్ సందర్భంగా రకరకాల రుచి చూస్తాం కాబట్టి బాడీని రీబూట్ చేయడం వల్ల హెల్దీగా ఉండొచ్చు.
haldi

పసుపు

స్వచ్ఛమైన పసుపును చిటికెడు తీసుకోవాలి. ఆరెంజ్ రసం చేసుకొని దాంట్లో ఆ పసుపు కలుపుకొని తాగాలి. ఇది కాలేయానికి యాంటి ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది.


ginger

అల్లం

ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. దానికి ఒక చెంచా నిండా అల్లం ముక్కలను కలిపి తాగాలి. కడుపు ఉబ్బరం సమస్యకు.. అజీర్తికి ఇది ఉపయోగపడుతుంది.


pineapplae-ginger-lemonade

నిమ్మ

ఒక నిమ్మకాయ నుంచి రసం తీసిపెట్టుకోవాలి. కాచి చల్లార్చిన ఒక గ్లాసెడు నీటిలో ఈ రసాన్ని కలపాలి. ఇది శరీర పీహెచ్‌ను రెగ్యులేట్ చేయడానికి, ఎసిడిటీ సమస్యలను పరిష్కరించడానికి
ఉపయోగపడుతుంది.


green-tea

గ్రీన్ టీ

తిన్న తర్వాత ఒక కప్పు స్వచ్ఛమైన గ్రీన్‌టీ తాగాలి. దీనివల్ల శరీరం తేలిక అవుతుంది. కాలేయ సమస్యలకూ చెక్ పెడుతుంది.


kitchen-towel-food-poisonin

టొమాటో

వీటికి ఆలివ్ ఆయిల్, ఉప్పు కలుపుకొని సలాడ్స్, సూప్స్, జ్యూస్, ఆమ్లెట్స్‌లా చేసుకొని తింటే మంచి ఉపయోగంగా ఉంటుంది.

368
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles