శనగపిండితో మెరిసేలా..!


Sat,August 4, 2018 11:14 PM

చర్మం మీదిమృతకణాలు తొలిగిపోయి.. అది పునరుజ్జీవనం పొందాలంటే శనగపిండి బాగా పనిచేస్తుంది. ఈ పిండితో ఫేస్ మాస్క్‌లు ఎలా చేయాలో చదువండి..
face-mask
-శనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ చిక్కని పేస్ట్‌ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. దీనివల్ల ట్యాన్ తొలిగిపోయి చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.
-పొడిచర్మం ఉన్నవాళ్లకు ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. శనగపిండి, పాలు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత కడిగితే మేనిఛాయ మెరుగవుతుంది.
-పిగ్మేంటేషన్ సమస్యను, మచ్చలను మాయం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్యాక్ వేసుకోండి. శనగపిండిలో టమాటా పేస్ట్ కలిపి ముఖం, మెడ మీద రాయాలి. బాగా ఆరిన తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
-తాజా శనగపిండిలో నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-శనగపిండిలో, పసుపు వేసి పచ్చి పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపాలి.
దీన్ని ముఖానికి రాసి మర్దన చేయాలి. పావుగంట తర్వాత కడిగేయాలి.

238
Tags

More News

VIRAL NEWS

Featured Articles