శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం ఎలిఫెంటా గుహలు


Thu,September 27, 2018 10:58 PM

elephanta-caves-head
విశేషాలను, ప్రకృతి రమణీయతను తమలో ఇముడ్చుకున్న ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలోని ఘరాపురి ద్వీపంలో ఉన్నాయి. ఏనుగు ఆకారంలో ఉండడం మూలంగా వీటికి ఆ పేరు వచ్చిందని తెలస్తున్నది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పర్యాటక కేంద్రం జాతీయస్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది. దేశవిదేశాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. 1987లోనే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఎలిఫెంటా గుహలకు ఆ పేరు పోర్చుగీసు వారు పెట్టారని చెబుతారు. పోర్చుగీసువారి కాలం నుండి ఆంగ్లేయులు, డచ్‌వారు ఎందరో వీటిని సందర్శించారు. 12, 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఈ గుహల్లో ఉన్న విగ్రహాల ముఖాకృతులను మార్చేశారు. 9వ శతాబ్దం, 13వ శతాబ్దాల మధ్యకాలంలో (810-1260) సిల్హారా రాజులు వీటిని నిర్మించారు.


వీటిలో కొన్ని విగ్రహాలు రాష్టక్రూటులు నిర్మించారు. ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడే విధంగా ఈ గుహల్లో కొలువై ఉన్న విగ్రహాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. త్రిమూర్తి విగ్రహం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలను పోలివుంటుంది. నటరాజు, సదాశివుడు, అర్ధనారీశ్వరుని విగ్రహాలు రాష్టక్రూటుల కళలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇలా ఆధ్యాత్మిక చింతనను, ప్రకృతి అందాలను, చారిత్రక విజ్ఞానాన్ని ఒకే చోట అందిస్తున్న ఎలిఫెంటా గుహలు పర్యాటకులకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

1526
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles