వ్యక్తిగత సంపద ఐదేండ్లలో రెట్టింపు


Sat,December 8, 2018 01:24 AM

-ఈ క్విటీలపై పెరిగిన మోజు
-స్థిరాస్తులపై తగ్గిన క్రేజ్
-కార్వి - ఇండియా వెల్త్ రిపోర్ట్ 2018 వెల్లడి

wealth
దేశంలో స్థిరాస్తుల కన్నా చరాస్తులపైనే మక్కువ పెరిగింది. షేర్లలో పెట్టుబడి పెట్టడానికి గతంలో కన్నా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎస్‌ఐపీల ద్వారా మ్యూచువల్‌ఫండ్లలో పెట్టుబడి పెరిగింది. 2023 నాటికి వ్యక్తిగత సంపద రూ. 762 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. 2025 నాటికి స్టాక్‌మార్కెట్‌లో రాబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగి సెన్సెక్స్ మూడింతలు అవుతాయని కార్వి అంచనా వేస్తున్నది. ఇండియా వెల్త్ రిపోర్డు 2018 పేరుతో విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది.

అత్యధిక మిలియనీర్లు ఉన్న ఆసియా పసిఫిక్ దేశాల్లో మనది నాలుగో స్థానం. వ్యక్తిగత సంపద ఈ ఏడాది 14.02 శాతం పెరిగి రూ. 392 లక్షల కోట్లకు చేరుకుంది. 2017 లో 10.91 శాతం మాత్రమే పెరిగింది. దేశంలో స్థిరాస్తుల కన్నా షేర్లలో పెట్టుబడి పెరిగింది. ఎస్‌పీల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఏడాదంతా మదుపు చేస్తూనే ఉన్నారు. హెచ్‌ఎన్‌ఐలు, అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు కూడా సంప్రదాయ మదుపు మార్గాల కన్నా ప్రత్యామ్నాయ మార్గాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇలా ప్రత్యామ్నాయ మదుపు సాధనాల్లో పెట్టుబడి 33.46 శాతం మేర పెరిగింది. మొత్తం వ్యక్తిగత సంపదలో స్థిరాస్తుల వాటా 2017 లో 48శాతం ఉంటే ఈ ఏడాది అది 39.78 శాతానికి తగ్గింది. ఇందుకు ప్రధానంగా స్టాక్ మార్కెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెరగడమే. అలాగే ఫైనాన్షియల్ అసెట్స్ వాటా 60.22 శాతానికి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హెచ్‌ఎన్‌ఐల సంపద 70 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. మనదేశంలో హెచ్‌ఎన్‌ఐల సంపద గత ఏడాది 10.6 శాతం పెరిగింది. గత రెండేళ్లుగా ఈక్విటీ మార్కెట్ల పనితీరు బాగున్నందున మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీల్లో పెట్టుబడులు పెరిగాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీలు తగ్గడంతో ఒకప్పుడు సేఫ్ హెవెన్ పెరున్నవి ఇప్పడు ఆదరణ కోల్పోయాయి. కరెంట్ డిపాజిట్లు, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు, సేవింగ్స్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం బాగా తగ్గిపోయింది.
wealth1
1. దేశంలోని వ్యక్తుల వద్ద ఉన్న మొత్తం సంపద 14.02 శాతం పెరిగి రూ. 392 లక్షల కోట్లకు చేరుకుంది. వ్యక్తిగత ఫైనాన్షియల్ ఆస్తుల విలువ 17.42 శాతం ఎగబాకడంతో స్థిరాస్తుల విలువ 9.24 శాతం వృద్ధి నమోదైంది.

2. ఫైనాన్షియల్ ఆస్తుల రెండెంకల వృద్ధిరేటును వరుసగా సాధిస్తూ వచ్చింది. దేశంలోని మొత్తం వ్యక్తిగత ఆస్తుల విలువలో వీటి వాటానే 60.22 శాతం. గత మూడేండ్లుగా మొత్తం సంపదలో ఫైనాన్షియల్ ఆస్తుల వాటా క్రమంగా పెరుగుతూ వస్తున్నది. భవిష్యత్‌లో కూడా ఈ ట్రెండ్ కొనసాగవచ్చు.

3. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎన్‌ఐలు సగటున 9.5 శాతం పెరుగుతూ ఉంటే దేశ జనాభాలో 20 శాతం పెరుగుతూ వస్తున్నారు. గతేడాది భారత్‌లో 2,19,000 మంది ఉండగా, 2018లో 2,63,000కి చేరుకున్నారు.

4. గతంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లలో మదుపు చేసే భారతీయులు ఇప్పుడు ఈక్విటీ షేర్లలో మదుపు చేయడానికి ఇష్టపడుతున్నారు. మొత్తం సంపదలో ఈక్విటీ మదుపు వాటా 20.72 శాతానికి చేరుకున్నది. ఎఫ్‌డీ, బాండ్లలో మదుపు కేవలం 17.81 శాతమే పెరిగింది. మొత్తం సంపదలో 2016లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వాటా 20.69 శాతం.

5. 2018లో ఈక్విటీల్లో మదుపు చేసిన మొత్తం 30.32 శాతం పెరిగింది. ఈ వృద్ధి రేటు ఇలాగే మరికొన్ని సంవత్సరాల పాటు పెరిగే అవకాశం వుంది. 2025 నాటికి సెన్సెక్స్ మూడింతలు కానున్నది. ప్రపంచంలోనే 5వ అతి పెద్ద మార్కెట్ మన స్టాక్ మార్కెట్ ఎదుగనుంది.

6. మొత్తం సంపదలో మ్యూచువల్ ఫండ్ల వాటా 34.50 శాతం పెరిగింది. ఇందులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల వాటా ఏకంగా 67.90 శాతం వృద్ధి. సంవత్సరం మొత్తం మ్యూచువల్ ఫండ్లలో మదుపు పెరుగుతూ వస్తూనే వుంది. రిటైల్ ఇన్వెస్టర్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపీ)ల ద్వారా మదుపు పెరిగింది.

7. అన్ లిస్టింగ్ షేర్లలో మదుపు ఈ ఏడాది 36.83 శాతం పెరిగింది. వీటిలో హెచ్‌ఎన్‌ఐలు అత్యధికంగా మదుపు చేస్తున్నారు.

8. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ సంపద 2.8 శాతం పెరిగింది. భారత్‌లో మాత్రం ఈక్విటీల వైపు మొగ్గు చూపుతున్నారు.

9. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి వ్యక్తిగత సంపద ఏటా సగటున 14.19 శాతం చొప్పున పెరుగుతూ రూ. 762 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఫైనాన్షియల్ అసెట్స్ ఏటా సగటున16.99 శాతం పెరుగుతూ రూ. 518 లక్షల కోట్లకు చేరుకుంటాయి. అయితే స్థిరాస్తులు మాత్రం 9.34 శాతం పెరుగుతూ రూ. 244 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా.

10. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం వ్యక్తిగత సంపదలో ఫైనాన్షియల్ అసెట్స్ వాటా 68 శాతానికి చేరుకుంటుంది. మిగిలిన 32 శాతం సంపద
స్థిరాస్తుల రూపంలో ఉంటుంది .
wealth2

682
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles