వేసవిలో రక్షణ..

Tue,March 21, 2017 01:49 AM

వేసవి తాపానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే హాయిగా కాలం వెళ్లదీయగలం. లేకపోతే జుట్టు రాలడం, చర్మం కమిలిపోవడం, నీరసం, వడదెబ్బ.. ఇలా అనేక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. అందుకే ఈ ప్రాణాయామాల్ని చేసి తాపాన్ని తరిమేయండి.
sithakari

శీతకారి ప్రాణాయామం


సుఖాసనంలో మెడ, వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. పళ్ల వరుసలు నొక్కి పట్టి, నాలుక చివరను పళ్ల లోపలి భాగానికి ఆన్చాలి. పెదవులు తెరిచి ఉంచి, గాలిని పళ్ల మధ్య నుంచి లోపలికి పీల్చుకోవాలి. ఇప్పుడు పెదవుల్ని మూసేయాలి. పీల్చిన గాలిని కొద్దిసేపు లోపల ఆపి తర్వాత ముక్కు నుంచి బయటకు వదిలేయాలి. ఈ ప్రాణాయామం పది నుంచి ఇరవైసార్లు చేయాల్సి ఉంటుంది.

ఉపయోగాలు :


-శరీరంలో ఉన్న అనవసరపు వేడిని బయటకు పంపిస్తుంది.
-కోపం తగ్గుతుంది.
- రక్తం శుద్ధి అవుతుంది.
-మొటిమలు తగ్గి ముఖం కాంతివంతమవుతుంది.

జాగ్రత్తలు :


-జలుబు, శ్లేష్మం, దంత సమస్యలు ఉన్నవారు
ఈ ప్రాణాయామం చేయరాదు.
-అధిక రక్తపోటు ఉన్నవారు గాలిని లోపల ఆపరాదు.
sithali

శీతలి ప్రాణాయామం


ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. నాలుకను ముందుకు చాపి మధ్యలోకి మడవాలి. నెమ్మదిగా ధ్వని చేస్తూ నాలుక ద్వారా గాలి లోపలికి పీల్చుకోవాలి. ఆ నాలుకను లోపలికి పంపి నోరు మూసుకోవాలి. ఇప్పుడు ముక్కు నుంచి శ్వాసను వదిలివేయాలి. ఈ ప్రాణాయామం ఇరవై నుంచి ముప్పై సార్లు చేయాల్సి ఉంటుంది.

ఉపయోగాలు :


- శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వచ్చి అంతర్గత అవయవాల పనితీరు మెరుగవుతుంది. - మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది.
- అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
- మొటిమలు తగ్గుతాయి. - కోపం తగ్గుతుంది.
- కళ్ల వేడి తగ్గుతుంది.
జె. దుర్గేష్ కుమార్
యోగా ట్రైనర్,
సంతూస్ స్టూడియో
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్,9704229212

703
Tags

More News

మరిన్ని వార్తలు...