వేరికోస్ వీన్స్ తగ్గడం సులువే!


Wed,June 10, 2015 02:48 AM

జనవరి 2, 2014...


74 ఏళ్ల ఆయన మా క్లినిక్‌కి వచ్చారు. రెండు కాళ్లలోనూ పిక్కలు లాగుతున్నాయన్నది ఆయన మొట్టమొదటి కంప్లెయింట్. నాలుగేళ్ల నుంచి వేరికోస్ వీన్స్ సమస్య వల్ల కాళ్లు నల్లగా అయినాయి. కాళ్ల నొప్పుల వల్ల ఆయనకు నిలబడడం, కొద్దిదూరం నడవడం కూడా కష్టం అవుతోంది. కూర్చుంటే నొప్పి తగ్గినట్టుగా ఉంటోంది. కాని రెండు పాదాలు కూడా మొద్దుబారినట్టు అవుతున్నాయి. దీనివల్ల సరిగా నిద్ర కూడా పోలేకపోతున్నాడు.

మరిన్ని లక్షణాలు


varicose-veins

కూర్చుని లేచినప్పుడు కళ్లు తిరుగుతున్నాయి. నడుస్తున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. సరిగా నడవలేకపోవడం, వెనకనుంచి ఎవరో తోస్తున్నట్టు అవడం వల్ల ఇలాంటి ఇబ్బంది కలుగుతున్నది. ఆయనకు అధిక రక్తపోటు కూడా ఉంది. దానికి మందులు వాడుతున్నాడు.
-నాలుగేళ్లుగా మూత్రవిసర్జన సమయంలో మంట ఉంటోంది. పదే పదే వెళ్లాల్సి వస్తోంది.
-అజీర్తి, కడుపుబ్బరం, కొంచెం తిన్నా కూడా పొట్ట నిండిపోయి, ఉబ్బరంగా ఉంటోంది.
-ఏమాత్రం వాతావరణం మారినా, నీళ్లు మారినా జలుబు, దగ్గు బాధిస్తాయి.

-రెండు కాళ్లలోని సిరలకు కలర్ డాప్లర్ స్టడీ చేశాం. పరీక్షలో తొడ మధ్య భాగంలో రిఫ్లక్స్ (ప్రతిచర్య) కనిపించింది. పిక్క భాగంలోని ఎముకలో రంధ్రాలు ఉన్నట్టు తేలింది. ఎస్‌ఎఫ్‌ఏ -పొప్లిటియల్ విభాగంలో (మోకాలి వెనుక భాగం) కలర్ ఫిల్లింగ్ లేకపోయినా సిరల్లో రక్తం గడ్డ కట్టివున్నట్టు స్పష్టమైంది.

శరీర తత్వం


-ఆకలి బాగానే ఉంది. కాని తినడానికి ఏమాత్రం ఆలస్యం అయినా తట్టుకోలేడు. శరీరం అంతా వణుకు మొదలవుతుంది. (ఆయనకు మధుమేహం లేదు).

-దాహం ఎక్కువ. నీళ్లు ఎక్కువగా తాగుతాడు.

-స్వీట్లు, చేపలు, మసాలా ఆహారం, పండ్లు ఎక్కువ ఇష్టంగా తింటాడు.

-13 ఏళ్లుగా సిగరెట్ తాగుతున్నాడు. రోజుకి 10 సిగార్లు కాల్చేస్తాడు.

-మలవిసర్జన సవ్యంగానే ఉంది గాని, నిద్ర లేవగానే టాయిలెట్‌లోకి పరుగు తీయాల్సిందే.

-మూత్రం ఆగి ఆగి వస్తుంది. మంట కూడా ఉంటుంది.

-అధికంగా చెమట పడుతుంది.

-కాళ్ల నొప్పుల వల్ల నిద్ర సరిగా పట్టదు.

-వేడి వాతావరణాన్ని తట్టుకోలేడు. చలికాలంలో కూడా కప్పుకొని పడుకోవాల్సిందే.

మానసిక తత్వం

-చాలా వేగంగా మాట్లాడతాడు. అర్థం చేసుకోవడం కష్టం.

-ఏ పని చేసినా తొందర ఎక్కువ. పరిగెత్తినట్టుగా నడుస్తాడు.

-మార్పు ఇష్టం ఉండదు. అందుకే 30 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నాడు. జాపకశక్తి తక్కువ కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోలేడు. కొత్త రకమైన పనిని చేయలేడు.

-చిన్నప్పటి నుంచి కూడా చాలా పిరికివాడు. తన సందేహాలను అడగడానికి కూడా భయమే. ఈ స్వభావం వల్ల రిజర్వ్‌గా ఉండడం అలవాటైంది.

-ప్రతిరోజూ రెండు మూడు వార్తాపత్రికలు అక్షరం వదలకుండా చదువుతాడు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ఇష్టం.

చికిత్స

pawanreddy

ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జనవరి 25ననే మందులు మొదలుపెట్టాం.

-26/3/2014 నాటికల్లా నిలబడినప్పుడు కళ్లు తిరగడం తగ్గింది. పాదాల్లో మంట కూడా తగ్గింది. తద్వారా నిద్ర సరిగా పడుతున్నది.

-27/6/2014 కల్లా నిలబడడం, నడవడం మెరుగయ్యాయి. వేరికోస్ వీన్స్ వల్ల వచ్చిన
-27/8/2014 రోజుకి కళ్లుతిరగడం పూర్తిగా తగ్గింది. వేరికోస్ వీన్స్ వల్ల వచ్చిన నలుపుదనం చాలావరకు తగ్గింది. పొట్ట ఉబ్బరం, అజీర్తి లాంటివన్నీ తగ్గుముఖం పట్టాయి.

-9/12/2014 రోజుకల్లా కళ్లు తిరిగే సమస్య ఎంతమాత్రమూ లేకుండా హాయిగా నడవగలిగాడు. వేరికోస్ వీన్స్ నొప్పి, నలుపుదనం తగ్గిపోయాయి.

3243
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles