వేప చేసే మేలు


Sun,August 13, 2017 01:20 AM

vepa-tho-labhalu
వేప ఆకుల్లో యాంటీ సెప్టిక్ గుణాలు, ఔషధ గుణాలు ఉంటాయి.
వేపాకులతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై వచ్చిన తెలుపు, నలుపు మచ్చలు తొలిగిపోతాయి.
తామర, సొరియాసిస్ వంటి వ్యాధులకు వేప అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. వేప విత్తులతో తీసే నూనెను వీటిపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.
వేపపొడితో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని పెడితే మొటిమలు మాయమవుతాయి.
వేపలో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ చర్మానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.
చర్మంపై ఏర్పడే పగుళ్లను తగ్గించి, కణ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.
వేప ఆకులతో కషాయం తయారు చేసి, చల్లారిన తర్వాత కాటన్ బాల్ సాయంతో రాతి పడుకునే ముందు ముఖానికి పెట్టుకోవాలి. ఉదయాన్నే కడిగేస్తే మంచి గుణం కనిపిస్తుంది.
వేపాకుల పేస్టుకు దోసకాయ, పసుపు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐప్లె చేస్తే మొటిమలు మాయమవుతాయి.
వేపనూనెను ఒక కప్పు నీటిలో కలిపి, ఆ మిశ్రమాన్ని చేతివేళ్లతో తీసుకుని నల్లటి వలయాలు ఏర్పడిన చోట రుద్దాలి. తరుచూ ఇలా చేస్తే మార్పు కనిపిస్తుంది.

668
Tags

More News

VIRAL NEWS

Featured Articles