వెన్నెముక చికిత్సలో ఆధునిక సర్జరీలు


Thu,January 25, 2018 02:02 AM

లాంబార్ డిస్క్ డిసీజ్ చాలా నొప్పి కలిగించి బలహీన పరిచే వెన్నెముకకు సంబంధించిన సమస్య. అప్పుడే పుట్టిన పిల్లల్లో డిస్క్‌లు చాలా మృదువుగా 88 శాతం నీటితోనే ఉంటాయి. క్రమంగా నీటి శాతం తగ్గుతూ వస్తుంది. నెమ్మదిగా 40 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి డిస్క్‌ల్లోని నీటి పరిమాణం 50-60 శాతానికి తగ్గిపోతుంది. అందువల్ల డిస్క్ బయటి భాగం గట్టిపడుతుంది. ఫలితంగా డిస్క్ వెలుపలి వైపు సన్నని పగుళ్లు ఏర్పడుతాయి. ఈ పగుళ్లను అన్యూలార్ టేర్స్ అంటారు. ఇవి చాలా సన్నగా ఉన్నప్పుడు వాటంతటవే తిరిగి కోలుకుంటాయి. కానీ ఒక్కోసారి ఈ పగుళ్లు కాస్త పెద్దగా ఉంటాయి. ఫలితంగా లోపలి వైపు ఉన్న మృదువైన భాగం ఈ పగుళ్ల ద్వారా బయటకు వస్తుంది. దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అయితే డిస్క్‌లోపలి భాగానికి పెద్దగా నొప్పి ఉండదు కానీ దాని పరిసరాల్లో ఉండే భాగంలో వాపు ఏర్పడడం వల్ల ఆ భాగంలోని నాడుల మీద ఒత్తిడి పెరుగుతుంది.
Lowback

లక్షణాలు

-లాంబగో - డిస్క్ పై భాగంలో ఏర్పడిన పగుళ్ల వల్ల కేవలం ఆభాగంలోని వెన్నులో నొప్పి రావడం
-సయాటికా- డిస్క్ ప్రొలాప్స్ వల్ల సయాటికా నాడి మీద ఒత్తిడి పడడం వల్ల ఆ నాడి సాగినంత దూరం నొప్పిగా ఉంటుంది. సాధారణంగా నడుము నుంచి కాళ్లకు నొప్పి పాకుతున్నట్టుగా ఉంటుంది.
-కాడా ఎక్సినా - నాడి మీద ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నాడి సాగినంత దూరం చర్మం స్పర్శ కోల్పోతుంది. ఒక్కోసారి కండరాల్లో కూడా బలహీనత రావచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మల మూత్ర విసర్జన మీద కూడా అదుపు కోల్పోతారు. ఇలాంటి వారికి వెంటనే సర్జరీ అవసరమవుతుంది.

డిస్క్ సమస్యల నిర్ధారణ

-డిస్క్ సమస్యలను నిర్ధారించడానికి ఎంఆర్‌ఐ ఇమేజింగ్ అన్నింటికంటే ముఖ్యమైన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా కేవలం ఆకారంలో వచ్చిన మార్పులు మాత్రమే కాదు అంతర్గత మార్పులను కూడా గుర్తిండం సాధ్యపడుతుంది. అంతేకాదు వెన్నెముకలోని లోపాలు, ట్యూమర్ల వంటి వాటిని కూడానిర్ధారించడం సాధ్యపడుతుంది.

చికిత్స

-డిస్క్ ప్రొలాప్స్ సమస్యకు చికిత్సగా రెండు రకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ ఓపెన్ మైక్రోసర్జరీ, ఎండోస్కోపిక్ డిసెక్టమీ. రెండో సర్జరీ విధానం అత్యాధునికమైంది. ఇది చిన్న కోతతో చేసేది కాబట్టి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి.
-సంప్రదాయ సర్జరీ విధానంలో వెన్నెముక భాగంలో పెద్ద కోత పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా పరిసరాల్లోని కండరాలు, నాడులకు నష్టం వాటిల్లవచ్చు. ఎండోస్కోపిక్ డిసెక్టమీ విధానంలో కేవలం లోకల్ ఎనస్థీషియా సరిపోతుంది. చర్మం మీద పెద్దగా కోత అవసరం లేదు కాబట్టి కండరాలకు కూడా పెద్దగా నష్టం జరగదు. ఎముకలు తొలగించాల్సిన అవసరం ఉండదు. నాడులకు కూడా ఎలాంటి నష్టం జరుగదు. సర్జరీ తర్వాత ఎలాంటి అనిశ్చితి ఉండదు. సర్జరీ తర్వాత వెన్ను నొప్పి కూడా ఉండదు. సర్జరీ జరుగుతున్న సమయంలో కూడా పేషెంట్ పూర్తి స్థాయిలో మెలుకువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. అందుకే దీన్ని బ్యాండ్ - ఎయిడ్ సర్జరీ అని కూడా అంటారు.
Drsura

645
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles