వెన్నునొప్పే అనుకొంటే అసలుకే ముప్పు


Wed,February 3, 2016 03:17 AM

వయసు పైబడే కొద్దీ వెన్నునొప్పి అంగవైకల్యంగా పరిణమించవచ్చు. వెన్ను నొప్పి కొందరిలో తాత్కాలికమే. కానీ కొంతమందిలో దీర్ఘకాలికంగా బాధించడమే కాదు క్రానిక్‌గా పరిణమించి తీవ్రమైన దుష్పరిణామాలకు కారణమవుతుంది. ఫలితంగా రోజు వారీ పనుల నుంచి లైంగిక జీవితం దాకా అన్నీ దెబ్బతింటాయి. సమస్య క్రానిక్‌గా మారుతున్న క్రమంలో మానవ జీవితం మూడు దశల్లో క్షోభకు గురవుతూ ఉంటుంది. వాటిలో ముందుగా శారీరకమైన నొప్పి మొదలై ఆ వ్యథతో మానసిక అనారోగ్యం మొదలవుతుంది. అంతిమంగా అది లైంగిక అశక్తత, నపుంసకత్వం దాకా వెళ్తుంది. వెన్ను నొప్పే కదా అని నిర్లక్ష్యంగా ఉండిపోతే అది మొత్తం జీవితాన్నే చేజేతులా జారవిడుచుకోవడమే అవుతుంది. వెన్ను నొప్పి ఏదో వృత్తిపరంగా వెనుకంజ వేసేలా మాత్రమే కాదు లైంగిక శక్తిని దెబ్బతీసి దాంపత్యబంధాన్ని కూల్చేసే దాకా వెళ్లొచ్చు.

ఎంత సంక్లిష్టం..


వెన్ను నిర్మాణం అనేది ఒక పెద్ద సంక్లిష్ట వ్యవస్థ. ఆ భాగంలోని కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, నరాలు, వెన్నుపాము అదో పెద్ద సమ్మేళనం. వీటిలో ఎక్కడ ఏ కాస్త దెబ్బ తగిలినా వెన్ను నొప్పి మొదలవుతుంది. సమస్య ఏమిటంటే, వెన్నునొప్పి శారీరకంగాగానే ఉండిపోకుండా అది లైంగిక వాంఛను కూడా దెబ్బతీస్తుంది. ముందు వెన్ను భాగంలో నొప్పిగానే మొదలైనా, తర్వాత ఆయా భాగాల్లో మొద్దుబారినట్టు, పొడిచినట్టు ఉండడం, శరీరమంతా శక్తిహీనమై చివరికి లైంగిక సమస్యలు మొదలవుతాయి. ఇంకా అలాగే కొనసాగితే అది నపుంసకత్వానికి దారి తీస్తుంది. అదే సమయంలో వెన్నునొప్పి నుంచి ఉపశమనానికి అదే పనిగా వేసుకుంటూ పోయే అలోపతి పెయిన్ కిల్లర్స్, దిగులు, ఆందోళన తగ్గడానికి ఇచ్చే యాంటీడిప్రెసెంట్ మాత్రలు, నర్వ్ స్టిమ్యులెంట్ మాత్రలు ఇవన్నీ అంతిమంగా లైంగిక శక్తిని దెబ్బతీస్తాయి. దీర్ఘకాలికంగా ఈ మాత్రలతోనే గడిపితే ఏదో ఒక దశలో నపుంసకుడిని చేసి వదిలేస్తుంది.

శీఘ్రస్కలనం చిన్న సమస్య?


ముందు అంగస్తంబనలోపాలతో మొదలయ్యే సమస్య ఒక దశలో శీఘ్రస్ఖలన సమస్యకు బీజం పడుతుంది. ఆ తర్వాత అదే నపుంసకత్వం దారి తీస్తుంది. దాని మూలాలు చాలా లోతైనవి. అత్యాధునికమైన ఎంఆర్‌ఐ రిపోర్టుల్లో వెన్నెముక నిర్మాణంలో వచ్చిన తేడాలు కనిపిస్తాయే తప్ప, వెన్నునొప్పి రావడానికి గల అసలు కారణం మాత్రం కనిపించదు. అందుకే ఆధునిక వైద్యశాస్త్రం ఈ నాటికీ వెన్నునొప్పి మూలాల్ని అర్థం చేసుకోలేకపోయింది. అయితే వెన్ను నిర్మాణం ఎంత సంకీర్ణమైందో అంగస్తంభన అన్నది కూడా అంతే సంకీర్ణమైంది. దానికి కారనం వెన్ను నాడివ్యవస్థ హార్మోన్లు, మెదడు భావోద్వేగాలు ఇవన్నీ ఇందులో అంతర్భాగంగా ఉండడే. అంతకన్నా మించి ఇందులో వాతం అత్యంత కీలకపాత్ర పోషించడం మరో ప్రధాన కారణం. మౌలికంగా వెన్నునొప్పి లైంగిక లోపాల వెనుక కూడా వాత ప్రకోపమే మూలంగా ఉంటుంది.

రెండింటికీ ఒకే సారి


నొప్పి ముందు కండరాల్లోనే మొదలైనా క్రమంగా అది డిస్కుల దాకా వెళ్తుంది. ఆ పక్కకు జరిగిన డిస్కుల ఒత్తిడితో వెన్నుపాము దెబ్బతిని చివరికి అది అంగస్తంభన లోపాలకు శీఘ్ర స్ఖలనానికి దారి తీస్తుంది. నొప్పి ఒకవేళ కండరాలకే పరిమితమై ఉంటే ఏవో కొన్ని మాత్రలతో తగ్గిపోవచ్చు. అలా కాకుండా, డిస్కులు నరాలు దెబ్బతినేదాకా వెళ్తే అది నంపుసకత్వం వైపే నడిపిస్తుంది. లైంగిక స్పందనలు కలగడానికి లైంగిక అవయవాలకూ, మెదడుకూ మధ్య వెన్నెముక ఒక వంతెనలా ఉంటుంది.
vardhan
ఒకవేళ ఆ వెన్నెముకలోనే లోపాలు ఉంటే పంచేంద్రియాల మధ్యనుంచే మొత్తం సమన్వయమే దెబ్బతింటుంది. వాస్తవానికి అంగస్తంభనలకూ, స్ఖలనాలకు సంబంధించిన కేంద్రాలు ఉండేది వెన్నులోనే. ఒకవేళ ఆ వెన్నే దెబ్బతింటే ఇక స్తంబనలు ఎలా కలుగుతాయి? శీఘ్రస్ఖలన సమస్యతో పాటు ఎవరికైనా వెన్నునొప్పి కూడా ఉంటే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఎందువల్ల అంటే ఈనాటి శీఘ్రస్ఖలన సమస్య మూలాలు తెలిసిన ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే శీఘ్రస్ఖలన సమస్య అంతటితో ఆగిపోయి, లైంగిక శక్తి నిలబడుతుంది. అయితే వాత హర చికిత్సలతో పాటు మేరు చికిత్స వాజీకరణ చికిత్సలను సంయుక్తంగా చేసినపుడే వెన్నునొప్పి సమస్యలు, లైంగిక సమస్యలు ఏకకాలంలో తొలగిపోతాయి. నిండైన ఆత్మవిశ్వాసంతో సాగిపోయే రోజులు మొదలవుతాయి.

1838
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles