వీడియోలతో రూ.లక్షల సంపాదన!


Sat,November 24, 2018 12:18 AM

ఇంగ్లండ్‌కు చెందిన ఈ 21యేండ్ల యువతి కేవలం యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చెయ్యడం ద్వారా ఏడాదికి సుమారు 50 లక్షల రూపాయలకుపైగా
సంపాదిస్తున్నది. ఏముంది ఆ వీడియోల్లో అంటారా? అవి చూసిన ఎంతోమంది ప్రశాంతంగా నిద్రపోతున్నారట. అందుకే ఆమె వీడియోలకంత క్రేజ్!
artist
ఏఎస్‌ఎమ్‌ఆర్ అంటే అటానమస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్. ఇదో సంగీత కళ. అందుబాటులో ఉన్న వస్తువులతో చిన్న చిన్న శబ్దాలు చేస్తూ.. వినేవారిని నిద్రపుచ్చడం. ఇంగ్లండ్‌లోని చెషైర్ ప్రాంతానికి చెందిన సోఫీ ఏఎస్‌ఎమ్‌ఆర్‌లో మంచి ఆర్టిస్ట్. 24 యేండ్ల సోఫీ సోదరుడు జేమ్స్‌కు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నది. దీనివల్ల అతనికి నిద్ర సరిగా పట్టేది కాదు. ఎలాగైనా తన సోదరుడి సమస్యకు పరిష్కారం చూపాలని యూట్యూబ్‌లో వెతికింది. ఆ సమయంలో ఏఎస్‌ఎమ్‌ఆర్‌కు చెందిన కొన్ని వీడియోలు ఆమెను బాగా ప్రభావితం చేశాయి. ఆ కళను ఎలాగైనా నేర్చుకోవాలనుకున్నది. పట్టుదలతో ఆ వీడియోలను అనుసరించి తానూ మంచి ఆర్టిస్ట్ అయింది. తన సోదరుడి వద్ద చిన్న చిన్న శబ్దాలు చేస్తూ రోజూ అతన్ని నిద్ర పుచ్చేది. అయితే చాలామంది నిద్ర పట్టకపోతే పాటలు వినడం, పుస్తకాలు చదువడం వంటి పనులు చేస్తుంటారు. ఈ కోవకు చెందిన వారిని దృష్టిలో ఉంచుకొని, తానే సొంతంగా వీడియోలు చెయ్యడం మొదలు పెట్టింది. నీటితో, గాలితో, డ్రమ్స్‌తో సంగీతం సృష్టిస్తూ, మైక్‌లో చిన్నగా గుసగుసలాడుతున్నట్లు మాట్లాడుతూ తన ఫాలోవర్స్‌ను నిద్రపుచ్చుతుంది. గోళ్లతో కొడుతూ, అటు ఇటూ తిప్పుతూ కొత్త సంగీతానికి బాటలు వేసింది. ఆ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసి సంవత్సరానికి సుమారు 56.2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నది. సోఫీకి 2.5 మిలియన్ల వ్యూయర్‌షిప్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

913
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles