విభిన్న పెళ్లి కానుకలు..


Mon,June 19, 2017 01:02 AM

పెళ్లంటే బ్యాండ్ బాజాలు, మందు, చిందు, గిఫ్టులు అబ్బో.. సీన్ సితార్ అవ్వాల్సిందే. కానీ ముంబైలోని రెండు జంటలు మాత్రం తమ పెళ్లిని కొంచెం వైవిధ్యంగా జరుపుకున్నాయి.
Defferent-Wedding
28 ఏళ్ల భవిన్ భట్ ఓ ఎమ్మెన్సీ కంపెనీలో సీనియర్ కన్సల్‌టెంట్. ముంబైలోని మంచూభాయ్ రోడ్డులో పక్షవాతంతో మూలుగుతున్న ఓ కుక్కను చేరదీసి వైద్యం చేయించడంతో దాని ఆరోగ్యం మెరుగైంది. ఈ ఘటనతో స్ఫూర్తిపొందిన భవిన్.. తన పెళ్లికి వచ్చే అతిథులు బహుమతులు నగదు రూపంలో ఇవ్వాలని స్నేహపూర్వకంగా శుభలేఖలో కోరాడు. పెళ్లిలో వారిచ్చిన నగదును ముంబై యానిమల్స్ అసోసియేషన్ (మా) అనే స్వచ్ఛంద సంస్థకు ఇచ్చాడు. భవిన్ ప్రయత్నం నచ్చడంతో బిలాల్ అనే వ్యక్తి కూడా తన పెళ్లికి వచ్చే వారు.. రక్త నమూనాలను ఇవ్వాలని కోరాడు. ఇందుకు దాత్రీ అనే ఎన్‌జీఓతో ఒప్పందం కుదుర్చుకుని రక్త నమూనాలు సేకరించాడు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవారికి అవసరమైనప్పుడు రక్తాన్ని ఇచ్చే ఏర్పాటు చేశాడు. మొత్తంగా ఈ రెండు జంటల ప్రయత్నాన్ని పలువురు మొచ్చుకుంటున్నారు.

1107
Tags

More News

VIRAL NEWS