విటమిన్ డి లోపం ఎందుకు?


Tue,February 13, 2018 11:17 PM

మా పాప వయసు 13 సంవత్సరాలు. ఈ మధ్య తరచుగా ఏదో ఒక భాగంలో నొప్పి అని అంటున్నదని డాక్టర్‌కు చూపించారు. డాక్టర్ తనకు విటమిన్ డి, బి12 పరీక్షలు చేయించారు. విటమిన్ డి తక్కువగా ఉందని చెప్పి మందులు ఇచ్చారు. ఇలా డి విటమిన్ తగ్గడం వల్ల తనకు ఒళ్లు నొప్పులుగా ఉంటున్నదని ఆమె అన్నారు. అసలు విటమిన్ డి లోపం ఏర్పడడానికి కారణం ఏమిటి? మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు.
-యశోద, జగిత్యాల

vitaminD
ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళల్లో, బాలికల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తున్నది. ఇప్పుడు మనదేశంలో ఇదొక సాధారణ సమస్యగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ లోపం ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి.
- మారిన సమాజ ధోరణులతో ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం బాగా తగ్గిపోయింది.
- జీవనశైలి మారిపోవడం వల్ల ఎక్కువ సమయం పాటు నీడపట్టునే సమయం గడిపే వారి సంఖ్య పెరిగిపోయింది. తగినంత ఎండ తగులకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతున్నది. అందుకే ఈ విటమిన్ లోపంతో బాధపడే వారి సంఖ్య పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువ.
- వాతావరణంలో కాలుష్యం పెరిగి పోవడం వల్ల అతినీలలోహిత కిరణాలు పరిమితిని మించి భూమిని చేరుతున్నాయి. ఇవి శరీరాన్ని తాకినపుడు శరీరం విటమిన్ డి ని ఎక్కువగా నష్టపోతుంది.
విటమిన్ డి తగ్గినపుడు శరీరంలో కాల్షియాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా కాల్షియం లోపం కూడా ఏర్పడుతుంది.
- పాలు, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
- ప్రతిరోజు తగినంత ఎండ తగిలేలా జాగ్రత్త పడాలి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యకాలంలో కనీసం అరగంట పాటు ఎండలో సమయం గడిపితే శరీరానికి తగినంత విటమిన్ డి అందుతుంది. ఈ సమయంలో ముఖం, చేతులు, కాళ్ల మీద ఏమీ కప్పుకోవద్దు. సన్‌స్క్రీన్ కూడా వాడకూడదు. ఎండ చర్మాన్ని తాకడం వల్ల శరీరంలో విటమిన్ డి తగినంతగా చేరుతుంది.
dr-vindya

780
Tags

More News

VIRAL NEWS